Horoscope Today 15th October 2023 : అక్టోబర్ 15న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతీ క్షణాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా చాలా బాగుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం (Gemini) : ఈ రోజు మిథునరాశివారికి ఏ మాత్రం బాగాలేదు. అనుకోని ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువులు, ఆరోగ్యం విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడిలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి బాగుంటుంది. స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారి గ్రహబలం బాగుంది. కళా రంగంలోని వారు మంచి అవకాశాలు పొందుతారు. కొత్తగా మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చికరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాగ్వాదాల్లో తలదూర్చకూడదు. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులు, సన్నిహితులతో అపోహలు ఏర్పడతాయి. శాంతం వహించడం మంచిది. దైవ ప్రార్థనతో సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు మంచి లాభాలు పొందుతారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారి గ్రహగతులు బాగా లేవు. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు, నష్టాలు వస్తాయి. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త! అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమికులు ఒక్కడవుతారు. వ్యాపారం విషయంగా ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త!
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు ఇవాళ మొదలు పెట్టకపోవడం మంచిది. స్నేహితులను అతిగా నమ్మకండి. వివాదాలకు దూరుంగా ఉండండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే.. కొంత వరకు సమస్యలు తీరుతాయి.