Horoscope Today 14th October 2023 : అక్టోబర్ 14న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేషరాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కోరుకున్న సంపదలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ప్రజ్ఞా, పాటవాలతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి అంత అనుకూలంగా లేదు. మానసిక వేదనకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అనవసర తగాదాల్లో తలదూర్చకండి. శాంతం వహించడం ఉత్తమం. ప్రయాణాలు కూడా వాయిదా వేయడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి కలిసి వస్తుంది. మీ సోదరులు సమయానికి ఆదుకుంటారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టి, లాభాలు గడిస్తారు. మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. సమాజంతో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. కానీ అవి తరువాతి కాలంలో ఫలించే అవకాశం ఉంది. కనుక నిరాశ చెందవద్దు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థికంగా సంతృప్తిగా ఉంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర దుర్భాషలకు దిగకూడదు. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్త!
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అనేక నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉన్నతోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమికులు ఒక్కటయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవ ప్రార్థన చేయడం వల్ల పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి కలిసి వస్తుంది. మీ మనసుకు నచ్చిన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి.. అందరి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఆవేశాన్ని తగ్గించుకోవాలి. కొన్ని కలవరపెట్టే సంఘటనలు ఎదురుకావచ్చు. భయపడకండి. దైవ ప్రార్థన చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. కళారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలు పొందుతారు. భాగస్వాములతో కలిసి చేసిన వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.