Horoscope Today 13th October 2023 : అక్టోబర్ 13న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : అంతా మన మంచికే అనే ధోరణితో ముందుకు సాగండి. కొన్ని గడ్డు పరిస్థితుల నుంచి ఈరోజు మీరు బయటపడతారు. మనశ్శాంతి లభిస్తుంది. దీంతో మీరు లబ్ధి పొందుతారు.
వృషభం (Taurus) : మీడియా అనుబంధ రంగాల్లోని వారు తమ చుట్టూ ఉండేవారిని ఈరోజు ఆకట్టుకుంటారు. దీంతో మీ సత్సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు అసాధారణమైన తెలివితేటలతో అన్ని విషయాలను సులువుగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కష్టానికి తగ్గ ఫలితం రాకపోవచ్చు. అయినా ఇవేమి మీరు పట్టించుకోకుండా ముందుకు సాగండి.
మిథునం (Gemini) : మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ముఖ్యంగా ఆడవారి విషయంలో చాలా జాగ్రత్తగా మెలగండి. జలగండం ఉంది. జలాశయాలకు దూరంగా ఉండండి. మద్యపానం అలవాటును మానుకోండి. లేదంటే దీర్ఘకాలంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిద్రలేమి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. కొన్ని ఆలోచనలు ఈ రోజు మిమ్మల్ని బాధిస్తాయి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దిగకండి.
కర్కాటకం (Cancer) : ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. స్నేహితులను, ప్రియమైన వారిని కలుసుకుంటారు. దీంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అదృష్టం ఈరోజు మీ వెంటే ఉంటుంది. మీ ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు ఉహించని స్థాయిలో ఉంటాయి. మీ ప్రత్యర్థులు మీ గెలుపును మౌనంగా అంగీకరిస్తారు. మీరు ఇష్టపడేవారి మనసుని ఈరోజు మీరు గెల్చుకుంటారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. ఒక్క చిన్నపాటి విహారయాత్రకు వెళ్లిరండి.
సింహం (Leo) : ఈరోజు మీకు సాధారణంగా గడుస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పలు సమస్యల్లో మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలుస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఈరోజు అనుకూలంగా లేదు. అయితే మీరు నష్టపోయిన దానికంటే ఎక్కువగా సంపాదించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను మీ కొత్త వ్యాపారంలో మీరు సమకూర్చుకుంటారు. మీరు చేయాల్సిందల్లా పనిపై శ్రద్ధ పెట్టడమే.
కన్య (Virgo) : ఈ రోజు మీరు చాలా మౌనంగా ఉంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. మీ ప్రియమైన వారితో వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. రుచికరమైన భోజనం చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. లేదంటే సంపూర్ణమైన మానసిక శాంతిని పొందలేరు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. ఆర్థికంగా లబ్ధి పొందుతారు.
తుల (Libra) : మీకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. ఇతరులతో మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీకు ఎదురయ్యే సమస్యలను జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించుకోండి.
వృశ్చికం (Scorpio) : ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీ స్నేహితులను ఈరోజు మీరు కలుసుకుంటారు. ఖర్చులు అధికంగా చేస్తారు. త్వరలోనే మీ జీవితంలో ఎదుగుదలను గమనిస్తారు. సహోద్యోగులు మీ పని నైపుణ్యాన్ని మెచ్చుకుంటారు. మీ జీవిత భాగస్వామిని ఈరోజు మీరు సంతోషపెడతారు.
ధనుస్సు (Sagittarius) : ఈరోజు అనేక ఆహ్లాదకరమైన సంఘటనలు మీకు ఎదురవుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో సరదా వాతావరణం ఏర్పుడుతుంది. అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. మొత్తంగా ఈరోజు తారాబలం అనుకూలంగా ఉంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది.
మకరం (Capricorn) : మీ తారా బలం ఈ రోజు బాగుంది. సృజనాత్మక, సాహితీపరమైన అన్వేషణల్లో పాల్గొంటారు. మీరు అలసిపోయి ఉంటే కాస్త విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
కుంభం (Aquarius) : ఈ రోజు మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందువల్ల కోపం, చిరాకు పెరుగుతాయి. ఈ సందర్బాలను తప్పించుకోవాలంటే దైవాన్ని స్మరించుకోవడం, ధ్యానం చేయడం మంచిది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు బాధపడే అవకాశం వుంది. అందువల్ల వీలైనంతవరకూ మంచి మాటలనే మాట్లాడండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. అందువల్ల ఖర్చులు పెరగవచ్చు.
మీనం (Pisces) : ఈ రోజు మీరు రోజువారీ పనులను పక్కనపెట్టండి. కుదిరితే కొంత సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపండి. నచ్చిన ఆహారం తినండి.