ETV Bharat / bharat

హనీట్రాప్​ చేసి వ్యభిచారం- ఏడుగురు అరెస్టు - మహారాష్ట్ర ఠాణెలో సెక్స్​ రాకెట్​

ఆన్​లైన్​లో పరిచయం అవుతారు. అందమైన మాటలతో(Honey trap) కవ్విస్తారు. తమ కోసం లాడ్జిలకు వచ్చేలా చేస్తారు. ఆపై బ్లాక్ మెయిల్​ చేసి,​ దోపిడీలకు పాల్పడుతారు. ఈ తరహా హనీట్రాప్​ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు.

హనీట్రాప్​
author img

By

Published : Oct 31, 2021, 9:59 PM IST

వలపు వల(Honey trap) విసిరి తమ బుట్టలో వేసుకుంటారు. అనంతరం వారిని లాడ్జికి రప్పిస్తారు. తర్వాత వారితోనే సెక్స్ రాకెట్​ నిర్వహిస్తారు. మహారాష్ట్ర ఠాణెలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు చేశారు.

యాప్​ల సాయంతో..

నిందితులు వివిధ యాప్​ల సాయంతో వినియోగదారులను ఆకర్షిస్తారు(Honey trap). ఆ తర్వాత వారిని బ్లాక్​మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేస్తారు. ఈ మేరకు ఠాణె వగ్లే ఎస్టేట్ డివిజిన్ ఏసీపీ జయంత్ బజ్​బేల్​ తెలిపారు.

"బాధితులను నిందితులు తాము ముందుగా నిర్ణయించుకున్న ఓ లాడ్జికి రప్పించేవారు. ఆ తర్వాత వారిని దోచుకునేవారు. శ్రీనగర్ పోలీసులు ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50,000 నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. వీటి మొత్తం విలువ రూ.1.20 లక్షలు" అని బజ్​బేల్ ​పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Honey trap: కిలాడీ కపుల్​.. హనీట్రాప్​తో 300 మందికి టోకరా!

Honey Trap: సైనైడ్​తో చంపేస్తుంది.. గుప్త నిధులు, రైస్​ పుల్లింగ్ పేరుతో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.