ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో హిజ్బుల్​ కీలక ఉగ్రవాది అరెస్టు - జమ్ముకశ్మీర్​ పోలీసులు

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో పోలీసులు శుక్రవారం ఆపరేషన్​ నిర్వహించి హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్ర సంస్థకు చెందిన జకీర్​ భట్​ను అరెస్టు చేశారు. షోపియాన్​లోని గనపోరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో గాలింపు చేపట్టారు. భద్రతా దళాలకు, ముష్కరులకు జరిగిన కాల్పుల్లో అయిత్మద్​​ అహ్మద్​ దార్ అనే లష్కరే తోయిబా తీవ్రవాది మృతి చెందాడు.

terrorist
ఉగ్రవాది
author img

By

Published : May 29, 2021, 10:39 AM IST

హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్ర సంస్థకు సంబంధించిన జకీర్​ భట్​ అనే తీవ్రవాదిని జమ్ముకశ్మీర్​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కుల్గాం జిల్లాలోని ఫైసల్​ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో మే 27, 28న పోలీసులు గాలింపులు చేపట్టారు.

జకీర్ భట్​ షోపియాన్​ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అక్కడే నివసిన్నాడని తెలిపారు. అతని ఇంట్లో బాంబులు, తుపాకులు భారీ ఎత్తున లభించాయని వెల్లడించారు. కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మరో ఆపరేషన్​ను షోపియాన్​లోని గనపోరా గ్రామంలో చేపట్టారు పోలీసులు. ఉగ్రవాద కదలికలను గమనించి వారిని లొంగిపోవాలని ఆదేశించారు. అయినా వారు కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో​ లష్కరే తోయిబాకు చెందిన అయిత్మద్​​ అహ్మద్​ దార్ అనే ఉగ్రవాది మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. ఇతను మార్చి 26 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నాడని తెలిపారు. ఎన్​కౌంటర్​ ప్రదేశం నుంచి ఏకే- 56 రైఫిల్​, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు తీవ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.