ETV Bharat / bharat

హెచ్​ఐవీ గర్భిణీ డెలివరీకి వైద్యుల నిరాకరణ.. బైక్​పైనే ఇంటికి తీసుకెళ్లి.. - కమ్యూనిటీ హెల్త్​ సెంటర్

పురిటి నొప్పులతో ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓ గర్భిణీకి.. హెచ్​ఐవీ పాజిటివ్​ అనే సాకుతో డెలివరీ చేసేందుకు నిరాకరించారు వైద్యులు. అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని కోరితే.. నడుచుకుంటూ వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీలేక బైక్​పైనే ఇంటికి తీసుకెళ్లి పురుడు పోశాడు ఆమె భర్త. ఈ అమానవీయ సంఘటన ఒడిశా, మల్కాన్​గిరి జిల్లాలో జరిగింది.

hospital
కుడుములుగుమ్మ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్
author img

By

Published : Dec 29, 2021, 1:21 PM IST

ఆపదలో ఉన్నవారికి చికిత్స అందించి వారికి అండగా నిలవాల్సిన వైద్యులే ఒక్కోసారి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడకుండా వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణీకి.. హెచ్​ఐవీ పాజిటివ్​ అనే నెపంతో డెలివరీ చేసేందుకు నిరాకరించిందో స్టాఫ్​ నర్సు​. ఈ సంఘటన ఒడిశా, మల్కాన్​గిరి జిల్లాలోని కుడుములుగుమ్మ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని పర్కాంమాలా ట్రైబల్​ ప్రాంతానికి చెందిన హెచ్​ఐవీ పాజిటివ్​ అయిన ఓ గర్భిణీకి ఈనెల 25న పురిటి నొప్పులు రాగా.. కుడుములుగుమ్మ సీహెచ్​సీకి తీసుకొచ్చాడు ఆమె భర్త. ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులెవరూ లేకపోవటం వల్ల గర్భిణీని పరీక్షించిన స్టాఫ్​ నర్స్​.. హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తి అని డెలివరీ చేసేందుకు నిరాకరించింది. మల్కాన్​గరి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేవని, ఇంటికి వెళ్లిపోయేందుకు అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని కోరాడు గర్భిణీ భర్త. కోపగించుకున్న స్టాఫ్​ నర్స్​ నడుచుకుంటూ వెళ్లిపోవాలని బెదిరించింది.

చేసేదేమీ లేక ద్విచక్రవాహనంపై నిండు గర్భిణీని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు ఆమె భర్త. ఇల్లు చేరిన తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది బాధితురాలు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్తకు హెచ్​ఐవీ సోకటం వల్ల.. రెండో కాన్పు సమయంలో బాధితురాలికి హెచ్​ఐవీ సోకింది. గత రెండేళ్లుగా మందులు వాడుతోంది. ప్రస్తుతం మూడో బిడ్డకు జన్మనివ్వగా.. గ్రామస్థులెవరూ వారి వద్దకు రాలేదు. దీంతో మనస్థాపం చెందిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఈ సంఘటన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

'మద్యం తాగొద్దా? అయితే.. నాకు టీకా వద్దే వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.