ETV Bharat / bharat

HIV బాధితుల విలేజ్​.. విద్య, వివాహంతో పాటు మరెన్నోసేవలు.. - ఎయిడ్స్​ రోగులు ఆశ్రమం

ఎయిడ్స్​ బాధితుడు అని తెలిస్తే చాలు.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు వారిని ఇంటికి దూరంగా ఉంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత వారిని ఆదుకోవడానికి ఎవరూ ముందుకురాక.. వారు మానసిక క్షోభకు గురవుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగాన్ని వదులుకొని.. హెచ్​ఐవీ బారిన పడ్డ చిన్నారులు, రోగులకు ఆశ్రయం కల్పించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఓ సారి ఆశ్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

happy indian village latur
హ్యాపీ ఇండియన్​ విలేజ్
author img

By

Published : Dec 1, 2022, 7:35 PM IST

Updated : Dec 2, 2022, 5:20 PM IST

HIV బాధితుల విలేజ్

హెచ్​ఐవీతో మృతి చెందిన ఓ చిన్నారికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడాన్ని చూసిన ఆ వ్యక్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగాన్ని వదులుకొని హెచ్​ఐవీ బాధితుల కోసం ప్రత్యేక గ్రామాన్నే నెలకొల్పారు. పట్టువదలని విక్రమార్కుడిలా వారికి కావలసిన వనరులను సమకూర్చారు.

happy indian village latur
ఆశ్రమంలో హెచ్​ఐవీ బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఇల్లు

మహారాష్ట్రలోని లాతుర్​ జిల్లాకు చెందిన రవి బాపట్ల అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా తన జీవితాన్ని హెచ్‌ఐవీ రోగులకు అంకితం చేశారు. 2007లో హెచ్‌ఐవీ బాధితుల కోసం 'హ్యాపీ ఇండియన్​ విలేజ్'​ను రవి నెలకొల్పారు. ఎయిడ్స్​ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఎందరో అనాధ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు ఈ సేవాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. వారికి సమయానికి మందులు అందించి వారి బాగోగులు చూసుకుంటున్నారు రవి.

happy indian village latur
రవి బాపట్ల, హ్యాపీ ఇండియన్​ విలేజ్​ వ్యవస్థాపకులు

మన్మతప్ప ముక్తా అనే వ్యక్తి ఈ సేవాలయానికి 60 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. వెంటనే సేవాలయం నెలకొల్పడానికి దరఖాస్తు చేసుకున్నాను. అప్పుడు ఆ గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా వారిని ఎదిరించి పనులు ప్రారంభించాను. క్రమంగా గ్రామస్థుల్లో మార్పు వచ్చి పనిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఈ సేవాలయం గురించి తెలిసి హెచ్​ఐవీ సోకిన పిల్లలు ఇక్కడకు రావడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో 85 మంది బాధితులు ఉన్నారు.
-- రవి బాపట్ల, హ్యాపీ ఇండియన్​ విలేజ్ వ్యవస్థాపకులు

అంతేకాకుండా ఉన్నత చదువులు చదివేలా పిల్లలను రవి బాపట్ల ప్రోత్సహిస్తున్నారు. దాంతో పాటు 18 సంవత్సరాలు దాటిన వారికి మరో ఎయిడ్స్​రోగితో వివాహాలు కూడా జరిపించి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవాలయంలో 85 మంది హెచ్​ఐవీ బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.

happy indian village latur
హ్యాపీ ఇండియన్​ విలేజ్​ ఆశ్రమం

మా అమ్మ కడుపులో ఉండగానే నాకు హెచ్​ఐవీ సోకింది. నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు మా తల్లిదండ్రులు ఎయిడ్స్​తో చనిపోయారు. ఐదో తరగతి చదువుతున్నప్పుడు మా బాబాయి నన్ను ఈ సేవాలయంలో చేర్పించారు. ఇంటర్​ వరకు చదువుకున్నాను. 2014లో మరో ఎయిడ్స్​రోగితో నా వివాహం జరిగింది. ప్రస్తుతం మా ఇద్దరు పిల్లలకు హెచ్​ఐవీ లేదు. దాదాపు 12 సంవత్సరాలుగా మా వివాహ జీవితం ఆనందంగా కొనసాగుతోంది.
-- రాణి, హెచ్​ఐవీ బాధితురాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 2, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.