ETV Bharat / bharat

'మశ్రూమ్ సిటీ ఆఫ్​ ఇండియా' ఎక్కడ ఉందంటే? - సోలన్ జిల్లా పుట్టగొడుగులు

హిమాచల్​ప్రదేశ్​లోని ఓ జిల్లాకు మశ్రూమ్​ సిటీ ఆఫ్​ ఇండియా అని పేరు ఉంది. ఆ జిల్లాకు ఈ బిరుదు లభించేందుకు ఓ పరిశోధన సంస్థ కృషి ఎంతో ఉంది. మరి ఆ జిల్లా ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవేయండి..

solan district
మశ్రూమ్ సిటీ ఆఫ్​ ఇండియా, సోలన్
author img

By

Published : Apr 24, 2021, 2:50 PM IST

మశ్రూమ్​ సిటీ ఆఫ్​ ఇండియా

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా.. మశ్రూమ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. ఈ బిరుదు వెనక ఖుంబా పరిశోధన కేంద్రం కృషి ఎంతో ఉంది. అసలు సోలన్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఖుంబా పరిశోధన కేంద్రం గురించి తెలుసుకోవాల్సిందే. ​ సోలన్‌లోని భారత పరిశోధన కేంద్రంలో పుట్ట గొడుగులపై పరిశోధనలు 1961లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 1983లో ప్రత్యేకంగా పుట్టగొడుగుల కోసమే ఖుంబా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 1997 సెప్టెంబర్‌లో సోలన్‌కు ఫేమస్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొచ్చింది. ఇప్పటివరకూ ఖుంబా కేంద్రంలో 30 జాతుల పుట్టగొడుగులను కనుగొన్నారు. 4 ఏళ్ల నిరంతర పరిశోధన తర్వాత.. ఇటీవలే గ్రిఫోలా రకం పుట్టగొడుగులను ఉత్పత్తి చేశారు పరిశోధకులు.

గత మూడు నాలుగేళ్లలో గ్రిఫోలా ఫ్రండోజా అనే కొత్తరకం పుట్టగొడుగును ఉత్పత్తి చేయడంలో విజయం సాధించాం. ఈ రకం పుట్టగొడుగుల్లో పుష్కలమైన ఔషధ గుణాలున్నాయి. క్యాన్సర్, మధుమేహం లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడి, ఊపిరితిత్తులను కాపాడే గుణాలు ఈ పుట్టగొడుగులో ఉన్నాయి.

--డా. సతీష్ శర్మ, శాస్త్రవేత్త.

గ్రిఫోలా పుట్టగొడుగుల్లో విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి.

ఈ పుట్టగొడుగును కలినరీ మెడిసినల్ మశ్రూమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏ రూపంలోనైనా దీన్ని తీసుకోవచ్చు. గనోడర్మా కూడా ఔషధ విలువలున్న పుట్టగొడుగే కానీ దాన్ని మనం తినలేం. ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. మనం పండించే పుట్టగొడుగులను కూరగాయలుగా వినియోగించుకోవచ్చు. ఎవరైనా తినొచ్చు దీన్ని. వాటిని ఎండబెట్టి, తర్వాత కూడా వాడుకోవచ్చు. పూర్తిగా ఎండిన తర్వాత పొడిగానైనా వాడుకోవచ్చు, రీహైడ్రేట్ చేసి, మళ్ళీ కూరగానైనా వండుకోవచ్చు.

--డా. సతీష్ శర్మ, శాస్త్రవేత్త

చైనా, జపాన్‌ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఈ పుట్టగొడుగులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం డీఎమ్​ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఔషధ గుణాలున్న గ్రిఫోలా పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రకం పుట్టగొడుగుల పెంపకంలో రైతులకు శిక్షణనిచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతమైతే పుట్టగొడుగుల పెంపకంలో రైతులకు శిక్షణనిచ్చే కార్యక్రమాలు చేపట్టడం లేదు కానీ.... భవిష్యత్తులో ఎవరైనా వీటిని పెంచేలా శిక్షణ అందిస్తాం. మా పనిలో రైతులందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశం మాకుంది.

--డా. వీపీ శర్మ, ఖుంబా పరిశోధన కేంద్రం డైరెక్టర్

క్యాన్సర్‌ను నియంత్రించడంలో... గ్రిఫోలా పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. గ్రిఫోలా పుట్టగొడుగులు ఎక్కువగా అడవుల్లో లభ్యమవుతాయి.

ఈ పుట్టగొడుగులను చెక్కపొట్టుపై పెంచుతాం. 22 నుంచి 24 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతాయివి. 2 నెలల తర్వాత దిగుబడి వస్తుంది. గతంలో ఈ పుట్టగొడుగులు చైనాలో ఎక్కువగా వినియోగించేవారు. ఈ ఔషధ పుట్టగొడుగులకు అక్కడ విపరీతమైన గిరాకీ ఉండేది. ఈ ఔషధ గుణాల వల్లే ఇవి అంతలా ఆదరణ పొందాయి. సిట్రేట్లు అధిక మోతాదులో ఉండడం వల్ల క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయీ పుట్టగొడుగులు.

ఖుంబా పరిశోధన కేంద్రంలో ఇప్పటివరకూ 10 నుంచి 15 రకాల పుట్టగొడుగులను అభివృద్ధి చేశారు. నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపర్చడం సహా.. క్యాన్సర్‌తో పోరాడే వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఈ రకరకాల పుట్టగొడుగులు ఉపయోగపడతాయి.

ఈ రకం పుట్టగొడుగులుక మార్కెట్లోనూ మంచి ధరే లభిస్తోంది. ఫార్మా సంస్థలూ వీటిన రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. రబీ, ఖరీఫ్ కాలాల్లో నష్టాల బారిన పడిన రైతులను పుట్టగొడుగుల పెంపకం నుంచి ఊరట లభిస్తోంది. అందుకే ఎక్కువ మంది రైతలు వీటి పెంపకం వైపునకే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో గ్రిఫోలా పుట్టగొడుగుల పెంపకంలో ఔత్సాహిక రైతులకు శిక్షణనిచ్చేందుకు శిక్షకులను కూడా నియమిస్తామని చెప్తున్నారు పరిశోధకులు.

ఇదీ చదవండి:'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.