ETV Bharat / bharat

హిమాచల్ ప్రదేశ్ కేబినెట్​ కీలక నిర్ణయం.. OPS పునరుద్ధరణ.. ఉద్యోగుల హర్షం

హిమాచల్​ ప్రదేశ్​లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్​ సుఖు అధ్యక్షతన మొదటి కేబినెట్​ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాత పెన్షన్​ స్కీమ్​ను పునరుద్ధరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

himachal pradesh cabinet
హిమాచల్​ ప్రదేశ్​
author img

By

Published : Jan 13, 2023, 8:26 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ మఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని మంత్రివర్గం మొదటి కేబినెట్​​ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటూ.. పాత పెన్షన్​ పథకం పునరుద్ధరనకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్(ఎన్​పీఎస్​) కింద ఉద్యోగులు, పెన్షనర్లు సహా 1.36 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌ని పునరుద్ధరించింది ఓట్ల కోసం కాదని.. హిమాచల్‌ అభివృద్ధి చరిత్రను తిరగరాసిన ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆత్మగౌరవం కల్పించడం కోసమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉద్యోగులకు తమ ప్రభుత్వం అందించే సంక్రాతి కానుకని ఆయన అన్నారు. ఓపీఎస్ పునరుద్దరణ పట్ల ఉద్యోగులు.. కాంగ్రెస్​ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం నుంచే పాత పెన్షన్​ స్కీమ్​(ఓపీఎస్​) అమల్లోకి వస్తుందని.. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేస్తామని సీఎం సుఖు వెల్లడించారు. కాంగ్రెస్​ పార్టీ తొలి కేబినెట్​ సమావేశంలో ఓపీఎస్​ని తిరిగి ప్రవేశ పెడతామని.. ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. ప్రస్తుతం దానికి అనుగుణంగా నడుచుకుంటూ.. ఇచ్చిన మాట నెరవేర్చుకుందని ఆయన తెలిపారు. 2004 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు కొత్త పెన్షన్ పాలసీ పరిధిలోకి వస్తారని చెప్పారు.

ఈ ఏడాది ఓపీఎస్ అమలుకు రూ.800 నుంచి రూ. 900 కోట్లు అవసరం అవుతుందని.. దానికి కావలసిన నిధులను డీజిల్​పై రూ.3 వ్యాట్ పెంచడం వంటి పలు చర్యల ద్వారా సమకూర్చుకుంటామని ఆయన తెలిపారు. ఉద్యోగులకు రూ.4,430 కోట్లు, పెన్షనర్లకు రూ.5,226 కోట్లు, ఆరో వేతన సంఘం కింద రూ.1,000 కోట్ల డీఏ సహా గత భాజపా ప్రభుత్వం దాదాపు రూ.11,000 కోట్ల బకాయిలను ఉద్యోగులుకు ఇవ్వలేదని సుఖు చెప్పారు.

18 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 అందించే హామీని కూడా త్వరలోనే నెరవేరుస్తామని.. దానికోసం కొందరు మంత్రులతో రోడ్​ మ్యాప్​ను రెడీ చేశామని తెలిపారు. మరో నెలరోజుల్లో ఆ పథకాన్ని తీసుకువస్తామని ఆయన అన్నారు. దీంతో పాటుగా ఫిబ్రవరి 13లోపు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల అన్వేషణకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం వృధా ఖర్చులు, నిధుల దుర్వినియోగం కారణంగా రాష్ట్రం రూ. 75,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.