ETV Bharat / bharat

Hijab Row: 'మైనారిటీల గురించి పాకిస్థానా మాట్లాడేది?'

author img

By

Published : Feb 10, 2022, 7:10 AM IST

Hijab Issue: హిజాబ్​ అంశంపై పాకిస్థాన్‌ మంత్రులు చేసిన విమర్శలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తిప్పికొట్టారు. మైనారిటీలను నేరస్థులుగా, క్రూరంగా చూసే పాకిస్థాన్‌.. సహనం, లౌకికవాదం గురించి భారత్‌కు బోధించడం విడ్డూరమన్నారు.

Hijab Issue
నఖ్వీ

Hijab Issue: కర్ణాటకలో జరుగుతోన్న హిజాబ్‌ వివాదంపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందించారు. డ్రెస్‌ కోడ్‌ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న ఆయన.. ఇది భారతీయ సమ్మిళిత సంప్రదాయాన్ని కించపరిచే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పాకిస్థాన్‌ మంత్రులు చేసిన విమర్శలను ముక్తార్‌ అబ్బాస్‌ తిప్పికొట్టారు. మైనారిటీలను నేరస్థులుగా, క్రూరంగా చూసే పాకిస్థాన్‌.. సహనం, లౌకికవాదం గురించి భారత్‌కు బోధించడం విడ్డూరమన్నారు.

ముస్లింలతోపాటు మైనారిటీలకు సమాన హక్కులు, గౌరవం, శ్రేయస్సు అనేది భారతీయ సహనం, సామరస్యం, కలుపుకుపోయేతత్వంలో ఒక భాగమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ ఉద్ఘాటించారు. ప్రపంచంలో ప్రతి పదిమంది ముస్లింలలో ఒకరు భారత్‌లోనే ఉన్నారన్న ఆయన.. దేశంలో 3లక్షలకుపైగా మసీదులు ఉన్నాయని గుర్తుచేశారు. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం ప్రార్థనా స్థలాలతో సమానమన్నారు. వీటితోపాటు దేశంలో 50వేలకు పైగా మదర్సాలు, 50వేలకు పైగా మైనార్టీ విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పారు.

స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లో 1288 దేవాలయాలు ఉంటే ప్రస్తుతం కేవలం 31 మాత్రమే మిగిలాయని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేర్కొన్నారు. ఇక దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో మైనారిటీ జనాభా 23శాతంగా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3శాతానికంటే తక్కువేనని దుయ్యబట్టారు. భారత్‌లో మాత్రం ఇతర పౌరులతో సమానంగా మైనారిటీలు సమాన హక్కులు, సమాన ప్రయోజనాలు పొందుతున్నారని స్పష్టం చేశారు. దేశంలో డ్రెస్‌కోడ్‌ అంశానికి కొందరు మతం రంగు పూస్తున్నారన్న కేంద్రమంత్రి.. భారతీయ నిబద్ధత, సంస్కృతికి అపఖ్యాతి కలిగించే కుట్రేనని ఆరోపించారు.

ముందు మీ సమస్యల్ని పరిష్కరించుకోండి: అసదుద్దీన్‌

Hijab issue in karnataka: కర్ణాటకలో జరుగుతున్న 'హిజాబ్‌' వివాదంపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మజ్లిస్‌ పార్టీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ దీటైన సమాధానం ఇచ్చారు. మీ పని మీరు చూసుకుంటే మంచిదని హితవు పలికారు. ముందు మీ దేశంలోని సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ అమ్మాయిలకు సరైన రక్షణ ఇవ్వండి అంటూ ఎద్దేవా చేశారు.

Hijab Issue
అసదుద్దీన్‌

హిజాబ్‌ వస్త్రధారణ వివాదం కారణంగా కర్ణాటకలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మసూద్‌ ఖురేషి ఈ వివాదంపై ఓ ట్వీట్‌ చేశారు. 'ముస్లిం బాలికలకు విద్యను దూరం చేయడం వారి ప్రాథమిక, మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. హక్కులను కాలరాయడం, హిజాబ్ ధరించినందుకు వారిని భయభ్రాంతులకు గురిచేయడం పూర్తిగా అణచివేత. భారత్‌లో ముస్లింలను చిన్నచూపు చూడటాన్ని ప్రపంచ దేశాలు గ్రహించాలి’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

పాక్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని నిర్వహించిన ఎన్నిలక ర్యాలీలో మజ్లిస్‌ పార్టీ చీఫ్‌ మాట్లాడుతూ.. మీ పని మీరు చూసుకుంటే మంచిదని దాయాది దేశానికి చురకలంటించారు. 'బాలికల విద్యపై భారత్‌కు పాకిస్థాన్ ఉపన్యాసాలు ఇవ్వకూడదు. బాలికల విద్యపై పోరాడే మలాలా యూసఫ్‌జాయ్‌పై పాక్‌లోనే కాల్పులు జరిగాయి. దీంతో ఆమె మరో దేశంలో చదువుకోవాల్సి వచ్చింది. మీ ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో విఫలమై.. ఇప్పుడు భారత్‌కు పాఠాలు చెబుతున్నారు. ముందు మీ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోండి' అంటూ ఒవైసీ మండిపడ్డారు. కర్ణాటక హిజాబ్‌ వివాదం భారత అంతర్గత సమస్య అని దీంట్లో మీ జోక్యం అనవరమని ఘాటుగా స్పందించారు.

భాజపాపై విపక్షాల మండిపాటు..

Hijab News: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన హిజాబ్ వివాదంలో విపక్షాలు భాజపాపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్విటర్ వేదికగా కమలం పార్టీపై మండిపడ్డారు.

Hijab Issu
ఎంపీ మహువా మొయిత్రా

'కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలు.. ఏ దుస్తులు ధరించాలో మాకు చెప్పడం మానుకోవాలి. మాకు నచ్చిన దుస్తుల్ని మేం ధరిస్తాం. మీకు చూడటం ఇష్టం లేకపోతే మీ గుహలను వీడి బయటకు రాకండి' అంటూ విరుచుకుపడ్డారు. ఇదే తరహాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. నచ్చిన దుస్తులు వేసుకోవడం మహిళల హక్కు అని ఆమె స్పష్టం చేశారు. దుస్తుల ఎంపిక మహిళల ఇష్టమన్నారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మంగళవారం హిజాబ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే బెంగళూరులోని పాఠశాలలు, కళాశాలలకు దగ్గర్లో నిరసనలు నిర్వహించడంపై రెండువారాల పాటు నిషేధం విధించింది.

ఇదీ చదవండి: విస్తృత ధర్మాసనానికి హిజాబ్​ కేసు- కళాశాలల బంద్​తో కాస్త ప్రశాంతత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.