ETV Bharat / bharat

'ఒక్కరి వల్ల 406 మందికి కరోనా ముప్పు' - దేశంలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసులు విపరీతంగా పెరగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కరోనా మరణాల తగ్గింపే మనముందున్న లక్ష్యం కావాలని కేేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ తెలిపారు.

high level meeting conducted by health ministry amidist of covid surge in the country
కరోనా మరణాల తగ్గింపే లక్ష్యం: కేంద్రం
author img

By

Published : Mar 27, 2021, 8:48 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కొవిడ్​ నిబంధనలు పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటించకపోతే కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 30 రోజుల్లో 406 మందికి వ్యాధి వ్యాపిస్తుందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.

ఐదు సూత్రాలు..

కరోనా నిబంధనలు పక్కాగా పాటించడం, టెస్టింగ్ సెంటర్లు సహా టీకా పంపిణీ కేంద్రాల పెంపు, కొవిడ్ బారిన పడిన వారిని సకాలంలో గుర్తించడం, మహమ్మారి సోకిన వారంతా ఐసోలేషన్​లో ఉండేలా చూడటం వంటివి కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యూహాలుగా ఉపయోగపడతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 46 జిల్లాల్లో కనీసం 14 రోజులపాటు సమర్థవంతమైన నియంత్రణ, కాంటాక్ట్ ట్రేసింగ్‌తో కరోనాను కట్టడి చేయాలని కోరింది. అలాగే ఆర్​టీపీసీఆర్​ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్దేశించింది.

మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 25 తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 59.8శాతం ఈ జిల్లాల నుంచే ఉన్నాయని తెలిపింది.

మరణాల రేటు తగ్గాలి..

కరోనా రెండో దశ మొదలైన నేపథ్యంలో ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్ సూచించారు. కొవిడ్​ మరణాల రేటును తగ్గించడమే మనముందున్న లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, బస్​స్టాండ్లు, పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు మొదలైన ప్రదేశాలలో కొవిడ్​ నిబంధనలు పాటించేలా దృష్టి సారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

ఈ సమావేశంలో కొవిడ్​ తీవ్రత అధికంగా ఉన్న 46 జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు

'వ్యాక్సినేషన్​తోనే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ'
కరోనాతో మానసిక కల్లోలం- ఇదిగో పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.