ETV Bharat / bharat

ఉన్నత స్థాయి విచారణ జరగాలి: రైతు సంఘాలు - farmer protest today latest updates

జనవరి 26 నాటి హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు డిమాండ్​ చేశారు. రైతులపై పోలీసులు.. తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులకు ఆర్థిక, న్యాయ సహాయాన్ని తాము అందిస్తామని తెలిపారు.

farmer unions about january 26th incident
ఉన్నత స్థాయి విచారణ జరగాలి: రైతు సంఘాలు
author img

By

Published : Feb 13, 2021, 7:41 PM IST

దిల్లీలో జనవరి 26 నాటి ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మక ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని రైతు సంఘాలు శనివారం డిమాండ్​ చేశాయి. అన్నదాతలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించాయి. ఈ మేరకు సింఘు సరిహద్దులో విలేకరులతో సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) సభ్యులు మాట్లాడారు. నోటీసులు అందుకున్న రైతులు నేరుగా.. పోలీసుల వద్దకు వెళ్లకుండా, న్యాయ సలహా కోసం యూనియన్​ సంఘాలు ఏర్పాటు చేసిన లీగల్​ సెల్​ వద్దకు రావాలని తెలిపారు.

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తితో.. జనవరి 26 హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని ఎస్​కేఎం సభ్యుడు కుల్దీప్​ సింగ్​ డిమాండ్​ చేశారు. నాటి ఘటనలో 122 మంది రైతులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని మరో నేత రవీందర్​ సింగ్​ తెలిపారు. అరెస్టు చేసిన రైతులకు ఆర్థిక, న్యాయ సహాయాన్ని ఎస్​కేఎం అందిస్తుందని పేర్కొన్నారు.

రైతులను హింసించేందుకు వారిపై హత్యాయత్నం వంటి తప్పుడు కేసులు మోపారని ఎస్​కేఎం నేతలు ఆరోపించారు. ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతుల్లో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.