కొవిడ్ వేళ అందరూ ఇంటికే పరిమితమడం వల్ల... దాదాపు అన్ని పనులు ఆగిపోయాయి. ప్రపంచమంతా ఇంటర్నెట్, ఫోన్లతో గడిపేసింది. అయితే దేశంలోని న్యాయస్థానాలు మాత్రం నిరంతరాయంగా పని చేశాయి. కరోనా కాలంలో హైకోర్టులు, జిల్లా కోర్టులు ఆన్లైన్ వేదికగా మొత్తం 25 లక్షల కేసులను విచారించగా... సుప్రీంకోర్టు దాదాపు 10 వేల కేసులపై విచారణ జరిపింది. ఓ వర్చువల్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు, 19 వేల జిల్లాకోర్టులు ఉండగా... కరోనా సమయంలో 25 లక్షల కేసులు విచారించాయన్న న్యాయశాఖ మంత్రి... వాటిల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులే ఉన్నట్లు తెలిపారు. తద్వారా రూ. 115 కోట్ల జరిమాన ప్రభుత్వానికి అందింది.
ఇదీ చూడండి: జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: బంగాల్ సీఎం