రూ.25 కోట్లు విలువైన డ్రగ్స్‌ను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న 70 మంది ఆఫ్రికా జాతీయులను అరెస్టు చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే నిందితులు అక్రమంగా దేశంలోకి వచ్చారని తెలిపారు. అరెస్టైన వారిలో 9 మందిని అక్రమ మాదక ద్రవ్యాల రవాణా చట్టం కింద అరెస్టు చేశారు. వీరు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందాను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను స్వదేశానికి పంపించడానికి దిల్లీలో ఓ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. సరైన పత్రాలు లేని వారిని పట్టుకుని వారి దేశాలకు పంపిస్తున్నారు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సింఘు 'హత్య' కేసులో నలుగురి అరెస్టు