ETV Bharat / bharat

తుక్కు సామగ్రిలో గేర్‌ బాక్సులు.. తెరిచి చూస్తే హెరాయిన్​.. విలువ రూ.200 కోట్లు! - గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం

Heroin Seized: కోల్​కతా ఓడరేవులో తుక్కు సామగ్రితో కూడిన కంటెనర్​లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. దాదాపు ఈ హెరాయిన్ విలువ రూ.198 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం ఈ ఆపరేషన్ చేపట్టింది. లోహపు తుక్కు సామగ్రితో కూడిన ఈ కంటెయినర్‌.. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పోర్టు నుంచి ఫిబ్రవరిలో కోల్​కతా పోర్టుకు వచ్చిందని అధికారులు తెలిపారు.

HEROIN SEIZE
హెరాయిన్ సీజ్
author img

By

Published : Sep 10, 2022, 7:39 AM IST

Heroin Seized: కోల్‌కతా రేవులో తుక్కు సామగ్రితో కూడిన కంటెయినర్‌ నుంచి రూ.198 కోట్ల విలువైన 39.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు కొన్ని రోజుల క్రితం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు.

7.2 టన్నులకు పైగా లోహపు తుక్కు సామగ్రితో కూడిన ఈ కంటెయినర్‌ దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పోర్టు నుంచి ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చిందని, అందులో ఉన్న 12 గేర్‌ బాక్సులను తెరచి చూడగా 72 తెల్ల పొడి పాకెట్లు కనిపించినట్లు తెలిపారు. కంటైనర్‌లో మొత్తం 36 గేర్‌ బాక్సులు ఉండగా, అందులో 12 పెట్టెలపై తెల్ల రంగు గీతలు ఉన్నాయని, వాటిలోనే హెరాయిన్‌ పాకెట్లను దాచారని అధికారులు పేర్కొన్నారు. ఏటీఎస్‌ అధికారులకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మిగిలిన గేర్‌ బాక్సులను కూడా తెరిచి సోదాలు నిర్వహిస్తామని తెలిపారు. కోల్‌కతా రేవు నుంచి మరో దేశానికి పంపించే ఉద్దేశంతో ఈ కంటైనర్‌ను ఇక్కడికి రప్పించినట్లు తేలిందన్నారు.

ఇవీ చదవండి: 500 కిలోల నగలు ఉన్నా తెల్ల రేషన్ కార్డ్.. కౌన్సిలర్​కు కోర్టు షాక్

'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.