ETV Bharat / bharat

ఆ పోటీలో గెలిచిన వారికి హెలికాప్టర్​ రైడ్​ ఫ్రీ

వ్యాసరచన పోటీలో గెలిస్తే పెన్నులు, పుస్తకాలు బహుమతిగా ఇస్తుంటారు నిర్వాహకులు. అదే గొప్ప అనుకొని మురిసిపోతుంటాం. అదే పోటీల్లో గెలిచిన వారిని హెలికాప్టర్​లో ఎక్కించి తిప్పితే? ఐడియా అదిరింది కదూ..! వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని హెలికాప్టర్​ ఎక్కిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది కర్ణాటకలోని బెల్గాంకు చెందిన మానవ బంధుత్వ వేదిక.

helicopter ride offered winners
ఆ పోటీలో గెలిచిన వారికి హెలికాప్టర్​ రైడ్​ ఫ్రీ
author img

By

Published : Jan 10, 2021, 8:37 PM IST

Updated : Jan 10, 2021, 9:44 PM IST

కర్ణాటకలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నిత్యం వార్తల్లో ఉండే మానవ బంధుత్వ వేదిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని హెలికాప్టర్​లో ఎక్కించి ఆ రైడ్​నే వారికి బహుమతిగా ఇచ్చింది. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు ఈ హెలికాప్టర్​ రైడింగ్​ను బహుమతిగా ఇచ్చారు. మానవ బంధుత్వ వేదిక ఆధ్వర్యంలో గోకాకా పట్టణంలోని వాల్మీకి స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.

హెలికాప్టర్ రైడ్​లో విహారిస్తున్న విజేతలు..

వైష్ణవి కడోల్కర్(బెల్గాం), జ్యోతి గుడ్డీన్(శిరగుప్పి), సుధా కర్లీ(రాయ‌చూర్‌), సిమ్రాన్ భగవన్(యాదవాడ), వి.మానస(చామరాజనగర్‌)లు వ్యాసరచన పోటీ విజేతలు.. వీరంతా హెలికాప్టర్ రైడ్‌లో పాల్గొన్నారు.

helicopter ride offered winners
ఇదే హెలికాప్టర్​లో అలా అలా..

ఉపన్యాస(స్పీచ్)​ పోటీ విజేతలు.. పూజ(తీర్థహళ్లి), ముషారఫ్ సయ్య(ఘటప్రభ), ప్రియాంక భరణి(కలబురిగి), పవిత్ర పట్టరావత(మేళవంకి), శ్వేత జుగాలే(ధార్వాడ్‌), శ్యామల బరమా(కలఖంబా)

helicopter ride offered winners
నిర్వాహకులతో విజేతలు..
helicopter ride offered winners
హెలికాప్టర్​ ఎక్కే ముందు ఫోటోలకు ఫోజులు..

ఈ రైడ్​ను చూసేందుకు వచ్చిన ప్రజలు, గెలుపొందిన విజేతల మోముల్లో సంతోషంతో స్టేడియం ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

ఇదీ చదవండి: మ్యారేజ్​ బ్యూరో ప్రారంభించిన కుడుంబశ్రీ

Last Updated : Jan 10, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.