ETV Bharat / bharat

పొలంలో ఉన్నట్లుండి హెలికాప్టర్​ ప్రత్యక్షం.. అవాక్కైన జనం - పొలంలో హెలికాప్టర్​ ల్యాండింగ్

Helicopter Emergency Landing: ఆ గ్రామంలోని పొలాల్లో ఉన్నట్లుండి అకస్మాత్తుగా హెలికాప్టర్​ ల్యాండ్​ అయింది. దీంతో స్థానికంగా కోలాహలం మొదలైంది. ఆశ్చర్యంతో స్థానికులు హెలికాప్టర్​ చుట్టూ గుమిగూడారు. ఇంతకీ అసలు పొలాల్లో హెలికాప్టర్​ ఎందుకు ల్యాండైంది? అసలు ఏం జరిగింది?

Helicopter Emergency Landing
పొలం ఉన్నట్లుండి హెలికాప్టర్​ ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో గ్రామస్థులు
author img

By

Published : Jan 8, 2022, 7:34 PM IST

తమిళనాడులోని గ్రామంలో హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్

Helicopter Emergency Landing: తమిళనాడులోని ఈరోడ్​ జిల్లా అతియూర్​ గ్రామంలో శనివారం అకస్మాత్తుగా ఓ ప్రైవేట్​ హెలికాప్టర్​ ల్యాండ్​ అయ్యి స్థానికులను ఆశ్చర్యపరిచింది. పొలంలో హెలికాప్టర్​ ల్యాండ్​ అవడం చూసి గ్రామస్థులు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో కాసేపటికి పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Helicopter Emergency Landing
పొలంలో ల్యాండైన హెలికాప్టర్​

అసలేం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన భరత్​ (65) , షీలా (60) అనారోగ్యం కారణంగా కేరళలోని కొచ్చిలో చికిత్స పొందాలని భావించారు. అక్కడికి వెళ్లేందుకు ఓ హెలికాప్టర్​ను అద్దెకు తీసుకున్నారు. హెలికాప్టర్​లో కొంత దూరం ప్రయాణించాక ప్రతికూల వాతావరణం ఏర్పడటం వల్ల పైలట్​కు సిగ్నల్స్​ అందడం ఆగిపోయాయి. దీంతో అత్యవసర ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. మళ్లీ కాసేపటికి వాతావరణం అనుకూలించగా హెలికాప్టర్​ గమ్యస్థానానికి బయలుదేరింది.

Helicopter Emergency Landing
అతియూర్​లో ల్యాండైన హెలికాప్టర్​

ఇదీ చూడండి : బాలికపై ఆలయ పూజారి అత్యాచారం- జాతకం కోసం వెళ్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.