ETV Bharat / bharat

వరుణుడి బీభత్సం.. బెంగళూరులో రెండు రోజులు స్కూళ్లు బంద్​

తమిళనాడు, కర్ణాటకలో వరుణుడి బీభత్సానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వచ్చే నాలుగు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బెంగళూరులో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పరిస్థితిపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

heavy rains
వరుణుడి బీభత్సం
author img

By

Published : Nov 19, 2021, 7:39 PM IST

Updated : Nov 19, 2021, 9:10 PM IST

వరుణుడి బీభత్సం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై నగరంలో పలు చోట్ల కార్పొరేషన్ అధికారులు మోటార్​ పంపుల సాయంతో వరద నీటిని డ్రైనేజీలోకి మళ్లించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తెల్లవారుజామునే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలహీనపడుతుందని, రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అప్రమత్తం చేసింది. కర్ణాటక, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

heavy rains
చెన్నైలో వరదలో నడుస్తున్న విద్యార్థినిలు
heavy rains
చెన్నైలో మోటార్​ పంపుల ద్వారా వరద నీటిని డ్రైనేజీలో మళ్లిస్తున్న అధికారులు

కర్ణాటక అప్రమత్తం..

ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన కర్ణాటకకు.. వచ్చే నాలుగు రోజులు కూడా వర్ష ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాలు, దక్షిణ కన్నడ ఉడుపి, ఉత్తర కన్నడ, బెల్గాం, ధర్వాడ్, గడగ్​, హవేరి, చామరాజనగర్​, మైసూరు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు, దక్షిణ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో బెంగళూరు అర్బన్ డిప్యూటీ కలెక్టర్​ శుక్రవారం, శనివారం పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు రూరల్​, కోలర్, చిక్కబళ్లపుర, రామనగర, తుముకూరు, చామరాజనగర్​లో పాఠశాలలతో పాటు, కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కొట్టుకుపోయిన బైక్​...

heavy rains
వరదలో కొట్టుకుపోతున్న బైక్​

కర్ణాటక తుమ్కూరులో వరద ఉద్ధృతి పెరిగి ఓ బైక్ కొట్టుకుపోయింది. వంతెన దాటుతుండగా ఒక్కసారిగి ప్రవాహం పెరిగి ఈ ఘటన జరిగింది. బైక్ యజమాని సహా మరో ఇద్దరు కలిసి దాన్ని కొట్టుకుపోకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే వారు మాత్రం క్షేమంగానే బయటపడ్డారు. ఈ ప్రాంతంలోనే వరదలో చిక్కుకున్న పులువురిని స్థానికులు రక్షించారు.

heavy rains
తుమ్కూరులో వరదలో చిక్కుకున్న వారికి రక్షిస్తున్న స్థానికులు

అధికారులతో సీఎం సమావేశం..

వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. వరదల ప్రభావం, ప్రభుత్వం చర్యలపై జిల్లా యంత్రాంగంతో చర్చించారు.

పుదుచ్చేరిలో నీటమునిగిన వంతెన..

వర్షాల కారణంగా శంకరపారాణి నది పొంగిపొర్లి పుదుచ్చేరిలోని విల్లియనూర్ గ్రామంలో బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. దీంతో రవాణా స్తంభించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి: భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు- 9 మంది మృతి

Last Updated : Nov 19, 2021, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.