ETV Bharat / bharat

రాగల 24 గంటల్లో ఉత్తర భారతంలో భారీ వర్షాలు - భారత వాతావరణ శాఖ

రానున్న 6-7 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. వచ్చే 24 గంటల్లో గుజరాత్, మధ్యప్రదేశ్​, దక్షిణ రాజస్థాన్​లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Heavy rainfall
భారీ వర్షాలు
author img

By

Published : Jul 16, 2021, 10:54 PM IST

నైరతి రుతుపవనాలు తిరోగమనం దిశగా పయనిస్తున్న క్రమంలో రానున్న 6-7 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

అతి భారీ వర్షాలు..

ఉత్తర భారత్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ హిమాలయాలు, ఉత్తర్​ ప్రదేశ్​లో జులై 17 నుంచి 20 వరకు అతి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. జులై 18 నుంచి 20 వరకు పంజాబ్​, హరియాణా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్​లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

"వచ్చే 24 గంటల్లో గుజరాత్, మధ్యప్రదేశ్​, దక్షిణ రాజస్థాన్​లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొంకణ్​, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మాహేలోని కనుమ ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు."

-- భారత వాతావరణ శాఖ(ఐఎండీ)

పశ్చిమ్ బంగాల్, సిక్కింలో జులై 19 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.

ఇదీ చదవండి : 'ఆ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.