ETV Bharat / bharat

స్కిల్‌ కేసు: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్​ - Amaravati Inner Ring Road case

Hearing on Chandrababu Bail Petition in Skill Case: స్కిల్‌ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 3:38 PM IST

Updated : Nov 16, 2023, 5:37 PM IST

Hearing on Chandrababu Bail Petition in Skill Case: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపిస్తూ.. ఎన్నికలకు ముందు కావాలనే కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు.

బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసు 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. సీమెన్స్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంతా వెరిఫై చేయలేదని రాశారు.. ఈ ఫోరెన్సిక్‌ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని అన్నారు. ఈ కేసులో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన వారే రిపోర్టులో చెప్పారని లూథ్రా వాదించారు.

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్​ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు

ఈ కేసులో ముందుగా చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అనారోగ్య కారణాల కారణంగా హైకోర్టు అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన విచారణలో సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ మధ్యంతర బెయిలు పిటిషన్‌తో పాటు ప్రధాన బెయిలు పిటిషన్‌పై చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు.

ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన చంద్రబాబు, ఒకరోజు ఉండే అవకాశం

Chandrababu Right Eye Surgery: హైకోర్టులో బుధవారం చంద్రబాబు తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన తప్పనిసరిగా మందులు వాడాలని వైద్యులు చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. ఐదు వారాల కంటి చెకప్‌ కోసం వైద్యులు షెడ్యూల్‌ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కోర్టుకు విన్నవించారు. గుండె పరిమాణం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని అన్నారు. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు.

Police Restrictions at Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆంక్షలు.. మీడియాతో మాట్లాడవద్దని చంద్రబాబుకు హైకోర్టు షరతులు

Supreme Court on Chandrababu Petition: స్కిల్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్​పై (Chandrababu Quash Petition in Supreme Court) దీపావళి తర్వాత తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. ఈ కేసులో వాదనలు పూర్తి కావడంతో తీర్పును సుప్రీం రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనేదానిపై ఈ తీర్పు కీలకంగా మారబోతోంది. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్​ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభించనుంది.

Last Updated : Nov 16, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.