ETV Bharat / bharat

కొండ కోనలు దాటి... టీకా ఇచ్చి..

కశ్మీర్‌లోని సంచార తెగలకు కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్యసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండలు, లోయలు, నదులు దాటుకుంటూ గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరిస్తున్న ప్రజలను జాగృతం చేసి టీకా ఆవశ్యకతను వివరిస్తున్నారు. వైద్యసిబ్బంది పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

kashmir vaccination
కొండ కోనలు దాటి... టీకా ఇచ్చి..
author img

By

Published : Jul 7, 2021, 4:00 PM IST

టీకా పంపిణీకి వైద్యుల సాహసాలు

కొండ కోనలకు నిలయమైన కశ్మీర్‌లోని సంచార జీవనం చేసే ప్రజలకు టీకాలు వేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. రుతువులను బట్టి చాలామంది ప్రజలు పశువుల మేత, ఆహారం కోసం ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారికి టీకా కార్యక్రమం నిజంగా సవాలే అంటున్నారు.. బుద్గాం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తాజముల్ హుస్సేన్ ఖాన్. పర్వత ప్రాంతాల్లో సరైన రవాణా మార్గం లేక టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డు మార్గం ఉన్నంత వరకు అంబులెన్సుల్లో వెళ్తామని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే సంచార తెగలను కలవాలంటే కాలినడకనే వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. మార్గ మధ్యలో వైద్య సిబ్బంది కొండలు, లోయలు, నదులు దాటాల్సి ఉంటుందని వివరించారు.

మానసికంగా సిద్ధం చేసి..

సంచార తెగలకు టీకాలు వేసేందుకు నలుగురు ఆరోగ్య కార్యకర్తలు బృందంగా ఏర్పడ్డారు. ఒక్కో బృందం... తెగలు నివసించే గుడిసెల దగ్గరకు వెళ్లి తొలుత వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. టీకా ప్రయోజనాలు వివరించి వ్యాక్సినేషన్‌కు వారిని సన్నద్ధం చేస్తారు. చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించారని డాక్టర్‌ తాజమూల్‌ తెలిపారు. టీకా వేసుకుంటే గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోతామనే మూఢ నమ్మకం అక్కడి మహిళల్లో ఉన్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి అసత్య ప్రచారాలన్నింటిపైనా సంచార ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.

"కరోనా టీకా ఆవశ్యకతను వారికి అర్థం అయ్యేలా చెప్పడం చాల కష్టంతో కూడుకున్న పని. కానీ మా శక్తి మేరకు వారికి టీకా ఆవశ్యకతను వివరించి వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఒప్పిస్తున్నాం. మేము వారు నివసించే గుడిసెల వద్దకు వెళ్తున్నాం. ముఖ్యంగా 45 ఏళ్ల వయస్సు దాటిన వారితో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు టీకా వేసుందుకు కృషి చేస్తున్నాం."

-డాక్టర్‌ తాజముల్ హుస్సేన్ ఖాన్, బుద్గాం జిల్లా వైద్యాధికారి

కరోనా టీకాలు తీసుకునేందుకు వైద్య సిబ్బంది చూపిస్తున్న నిబద్ధత పట్ల... స్థానిక సంచార ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే తమలాంటి వారికి టీకాలు వేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

"పశువుల కోసం పచ్చిక భూములను వెతుకుతూ మేము ఎప్పుడూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తాము. ఇప్పటికే టీకా మొదటి డోసు తీసుకున్నాను. రెండో డోసు వేసేందుకు ఇక్కడకు వచ్చిన వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను."

-అల్లావుద్దీన్‌, స్థానికుడు

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు వైద్యులు తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌లో కోటీ 40 లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు అర్హులని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఇప్పటి వరకు 9శాతం ప్రజలకు టీకా వేసినట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.