ETV Bharat / bharat

గాజీపుర్ సరిహద్దును దిగ్బంధించిన రైతులు - గాజీపుర్ సరిహద్దు దిగ్బంధం

దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు గాజీపుర్ సరిహద్దును దిగ్బంధించారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి రహదారిని పూర్తిగా మూసివేశారు. రాకపోకలకు అంతరాయం కలుగుతుండటం వల్ల ట్రాఫిక్​ను మళ్లిస్తున్నారు పోలీసులు.

Farmers shut down NH-9 from Delhi to Ghaziabad
గాజీపుర్ సరిహద్దును దిగ్భందించిన రైతులు
author img

By

Published : Dec 22, 2020, 1:08 PM IST

Updated : Dec 22, 2020, 2:15 PM IST

దిల్లీ సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. గాజీపుర్​ సరిహద్దు(దిల్లీ-గాజియాబాద్​ రహదారి)ను పూర్తిగా దిగ్బంధించారు. రహదారుల రెండువైపులా ట్రాక్టర్లను అడ్డుపెట్టారు. రోడ్లకు అడ్డంగా రైతులు బైఠాయించారు. రాకపోకలను అడ్డుకోవడం వల్ల దిల్లీ నుంచి గాజీపుర్, గాజియాబాద్​కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

Farmers shut down NH-9 from Delhi to Ghaziabad
గాజీపుర్ సరిహద్దులో రైతులు

ఈ నేపథ్యంలో వాహనాలను వేరే రహదారులకు మళ్లిస్తున్నట్లు దిల్లీ ఔటర్​ రేంజ్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ సీపీ అప్సరా బోప్రా తెలిపారు. నిజాముదీన్ ఖట్టా, అక్షర్​దామ్, గాజిపుర్ చౌక్​ నుంచి ట్రాఫిక్​ను మళ్లించినట్లు చెప్పారు.

గాజీపుర్ సరిహద్దును దిగ్భందించిన రైతులు

ఇదీ చదవండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం

Last Updated : Dec 22, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.