ETV Bharat / bharat

'వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జాగ్రత్త తప్పనిసరి' - corona cases in india

కరోనా టీకా తీసుకున్నప్పటికీ.. ​ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను మరవకూడదని హెచ్చరించారు.

union helath ministry
'వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జాగ్రత్తగానే ఉండాలి'
author img

By

Published : Feb 9, 2021, 5:33 AM IST

వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న విశ్వాసంతో కరోనా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ హెచ్చరించారు. భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన సోమవారం పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశారు. కరోనా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కరోనా సమయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చర్యలను అభినందించారు. ఇప్పటికే దిల్లీలోని పలు ప్రాంతాల్లో మాస్కులను పంపిణీ చేశామని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనల్ని కచ్చితంగా పాటించాలన్నారు.

'2 కోట్ల మార్కును దాటాం'

అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం దేశంలో జరుగుతోందని హర్షవర్ధన్‌ వెల్లడించారు. భారత్‌లో రికవరీ రేటు 97.20గా ఉందన్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.48లక్షలుగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా టెస్టుల్లో ఇప్పటికే 2కోట్ల మార్కును దాటిన భారత్ ఇంకా ఎక్కువ టెస్టులు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. మాస్కులు, పీపీఈ కిట్లు దిగుమతి చేసుకొనే పరిస్థితి నుంచి వాటిని సొంతంగా తయారు చేసుకొని ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరిందన్నారు.

ఇదీ చదవండి:'ఆ 12 రాష్ట్రాలు వ్యాక్సినేషన్​లో స్పీడ్​ పెంచాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.