ETV Bharat / bharat

మహిళను కిడ్నాప్ చేసి 9 నెలలుగా రేప్.. తలకు తుపాకీ పెట్టి, బీఫ్ తినిపించి.. - కోల్​కతా మైనర్ రేప్

రాజస్థాన్​లో దారుణం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి.. నెలల పాటు అత్యాచారం చేశారు కామాంధులు. ఆ తర్వాత కిరాతకంగా చంపేశారు. మరోవైపు, కోల్​కతాలో మైనర్​పై గ్యాంగ్​రేప్ జరిగింది.

haryana-woman-kidnapping-and-murder-case

author img

By

Published : Oct 20, 2022, 9:32 AM IST

రాజస్థాన్​లో అత్యంత హేయమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. హరియాణాకు చెందిన మహిళను నెలల తరబడి బంధించి రేప్ చేశారు. అనంతరం, ఆమెను హత్య చేశారు. భరత్​పుర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దుండగులు మహిళను చిత్రహింసలు పెట్టారని ఆమె తండ్రి ఆరోపించారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సికార్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ మహేశ్ మీనా వివరాల ప్రకారం.. అక్టోబర్ 18న ఓ మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీలో ఉంచారు. మృతదేహం ఎవరిదని ఆరా తీశారు. దీంతో హరియాణాలో ఉంటున్న మృతురాలి తండ్రి గురించి తెలిసింది. తన కూతుర్ని 8-9 నెలల క్రితం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని మృతురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

"అప్పటి నుంచి నా కూతురి కోసం వెతుకుతున్నాం. మూడు నెలల క్రితం నా కూతురు గుర్తుతెలియని నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసింది. వహీద్, ఫయాద్, చాంద్ సింగ్, ఖమ్ము, దిను అనే వ్యక్తులే తనను కిడ్నాప్ చేశారని చెప్పింది.తలకు తుపాకీ గురిపెట్టి ఒక్కొక్కరూ అత్యాచారం చేశారని చెప్పింది. చంపేస్తామని బెదిరించారని తెలిపింది. బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారని, నమాజ్ చేయించారని చెప్పింది" అని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుధవారం మహిళ శవానికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె తండ్రికి మృతదేహాన్ని అప్పగించారు. అంతకుముందు మహిళ కుటుంబం.. కిడ్నాప్ కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

మైదానంలో మైనర్​పై రేప్
బంగాల్ కోల్​కతాలో మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు పలువురు దుండగులు. హరిదేవ్​పుర్ ప్రాంతంలోని ఓ మైదానంలోకి బాలికను లాక్కెళ్లి రేప్ చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఐదుగురు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేశారు. బాలిక గురించి నిందితులకు ముందే తెలుసని, అయితే, మైనర్​కు మాత్రం వీరంతా ఎవరో తెలియదని చెప్పారు. ఈ ఘటనలో ఇంకెవరికైనా భాగస్వామ్యం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.