ETV Bharat / bharat

మైనర్​పై 6 నెలలుగా ఏడుగురి అత్యాచారం - మైనర్​పై ఆర్నెల్లుగా ఏడుగురు వ్యక్తులు అత్యాచారం

మైనర్​పై ఏడుగురు వ్యక్తులు ఆరు నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చగా.. అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. హరియాణాలో ఈ ఘటన జరిగింది.

Minor girl raped for over six months
మైనర్​పై ఏడుగురు వ్యక్తులు ఆర్నెల్లుగా అత్యాచారం!
author img

By

Published : Mar 12, 2021, 8:29 AM IST

హరియాణాలోని భివానీ జిల్లాలో పాశవిక ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు.. 6 నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలిక గర్భం దాల్చగా రేప్​ విషయం బయటపడింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బాలిక వెళ్లగా.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తొలుత ఆమెపై కొద్ది మంది లైంగికదాడికి పాల్పడ్డారని, అనంతరం మిగతావారూ ఆమెను వేధిస్తూ వచ్చారని చెప్పారు. అత్యాచార విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించారని తెలిపారు. నిందితుల్లో ఓ తండ్రీ కుమారుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

బాలిక గర్భం దాల్చి ఎన్ని నెలలు అవుతుందో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులకు 50 ఏళ్ల వయస్సు ఉంటుందని.. మరో ఇద్దరికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని తెలిపారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:విషవాయువుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.