ETV Bharat / bharat

106 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. పరుగు పందెంలో బామ్మకు స్వర్ణం - రమాబాయి రన్నింగ్ రేస్

100m race 106 old Woman : అథ్లెటిక్స్​లో రికార్డు సృష్టించింది ఓ బామ్మ. వందేళ్ల వయసులో రన్నింగ్ రేసులో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాల్గొనడమే కాకుండా పోటీల్లో స్వర్ణం ఎగరేసుకుపోయింది.

Grand Mother running race
Grand Mother running race
author img

By

Published : Jun 26, 2023, 7:51 PM IST

Grand Mother running race: వయసు 100 ఏళ్లు దాటినా.. తగ్గేదే లేదని నిరూపించింది ఓ బామ్మ. నడవడమే కాదు, కూర్చొని కాళ్లు చేతులు ఆడించడమే కష్టం అనుకునే వయసులో ఈ బామ్మ.. వంద మీటర్ల పందెంలో పాల్గొని అదరగొట్టింది. హరియాణాలోని చార్కి దాద్రికి చెందిన రమాబాయి 106 ఏళ్ల బామ్మ.. ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లో జరిగిన 18వ జాతీయ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో ఏకంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగు పందెంలో ఈ బంగారు పతకం సాధించింది. పరుగు పందెంతో పాటు షాట్​పుట్​ పోటీల్లో సైతం పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యువరాణి మహేంద్ర కుమారి జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో దాదాపు 800 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.

100m race 106 old Woman
పరుగెడుతున్న రమాబాయి
100m race 106 old Woman
గోల్డ్ మెడల్ సాధించిన రమాబాయి

ఈమెతో పాటు మరో ఇద్దరు వృద్ధ దంపతులు సైతం ఈ పోటీల్లో అదరగొట్టారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన 74 ఏళ్ల జైసింగ్ మాలిక్​, అతడి భార్య 70 ఏళ్ల రమార్తి దేవి బంగారు పతకాలు సాధించారు. హరియాణాకు చెందిన ఈ జంట 3 కిలోమీటర్ల నడక పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించింది. యువత.. ఇలాంటి పోటీల్లో పాల్గొని ఫిట్​గా ఉండాలని సూచించారు జైసింగ్​.

100m race 106 old Woman
బంగారు పతకాలతో జైసింగ్ దంపతులు

"5 సంవత్సరాల నుంచి 100 ఏళ్లకు పైగా వయసున్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాం. 100 ఏళ్లకు పైగా వయసున్న వారు సైతం ఈ పోటీల్లో పాల్గొని.. ఫిట్​గా ఉండేలా యువతకు సందేశం ఇస్తున్నారు."
--జీత్ కౌర్, నిర్వాహకుడు

94 ఏళ్ల వయసులో పరుగు పందెంలో స్వర్ణం
అంతకుముందు ఓ 94 ఏళ్ల బామ్మ సైతం పరుగు పందెంలో అదరగొట్టింది. ఫిన్​లాండ్​ వేదికగా గతేడాది జూన్​ 29 నుంచి జులై 10వరకు జరిగిన వరల్డ్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఔట్​డోర్​ ఛాంపియన్​షిప్స్​లో.. భారత్​కు చెందిన 94ఏళ్ల భగ్వానీ దేవీ దాగర్​ రికార్డు సృష్టించింది. 100మీటర్ల పరుగు పందెంలో పాల్గొని లక్ష్యాన్ని 24.74 సెకన్లలో ముగించి బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాకుండా షాట్​పుట్​లోనూ పాల్గొని తన సత్తా చాటింది. బ్రాంజ్​ మెడల్​ను దక్కించుకుంది. అంతకుముందు ఈ వరల్డ్ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​కు అర్హత సాధించేందుకు చెన్నై వేదికగా జరిగిన నేషనల్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో పాల్గొని మూడు స్వర్ణాలు సాధించి రికార్డుకెక్కింది. పూర్తి వార్త చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి : 80ఏళ్ల ఏజ్​లో పతకాల పంట.. 60 గోల్డ్​ సహా 200కు పైగా మెడల్స్​ సొంతం!

82 ఏళ్ల బామ్మ తగ్గేదేలే.. ఈత పోటీల్లో గోల్డ్ మెడల్.. వందల మందితో పోటీ పడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.