ETV Bharat / bharat

నేడు దేశవ్యాప్తంగా రెండో దఫా టీకా డ్రై రన్​

కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి ముందు శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా డ్రై రన్​ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్​ జరగనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాయి ఆయా ప్రభుత్వాలు. డ్రై రన్​పై గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​.

author img

By

Published : Jan 8, 2021, 5:09 AM IST

Updated : Jan 8, 2021, 8:43 AM IST

Vaccine dry run
నేడు దేశవ్యాప్తంగా రెండో దఫా టీకా డ్రై రన్​

దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్​ నిర్వహించగా.. శుక్రవారం మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్​ నిర్వహిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్​ జరగనుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఆయా ప్రభుత్వాలు.

736 జిల్లాల్లో...

దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్​ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 2న తొలివిడత డ్రై రన్​లో మొత్తం 125 జిల్లాలలో నిర్వహించారు.

ప్రత్యేక దృష్టి పెట్టాలి..

దేశవ్యాప్తంగా రెండో దఫా వ్యాక్సిన్​ మాక్​ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్​ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. టీకా డ్రై రన్​ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కొవిడ్​-19 వ్యాక్సిన్​ భద్రత, సామర్థ్యంపై పుకార్లు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కో-విన్​ యాప్​ పనితీరుపై వివరించారు.

జనవరి 2న జరిగిన డ్రై రన్​లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకొని శుక్రవారం చేపట్టే డ్రై రన్​కు సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర మంత్రి. గత మాక్​ డ్రిల్​పై చాలా రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. శుక్రవారం జరిగే డ్రై రన్​లో ఆసుపత్రి, బ్లాక్​, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి డేటాను పరీక్షించనున్నట్లు తెలిపారు.

"వ్యాక్సిన్​ పంపిణీలో వచ్చే లోటుపాట్లను గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ డ్రై రన్​ ఉపయోగకరంగా ఉంటుంది. చివరి లబ్ధిదారుడి వరకు వ్యాక్సిన్​ అందించేందుకు దేశవ్యాప్తంగా కోల్డ్​ చైన్​ విధానాన్ని మరింత పటిష్ఠం చేశాం. భారత్​ పోలియో, రూబెల్లా వంటి భారీ వ్యాక్సినేషన్​ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టింది. టీకా పంపిణీ కోసం మానవ వనరులను బలోపేతం చేయాలి. ఇప్పటికే వివిధ స్థాయుల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాం. వ్యాక్సిన్​ నేషన్​ ప్రక్రియను పలు దఫాలుగా పరీక్షించాం. "

- హర్షవర్ధన్​, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

తమిళనాడు పర్యటనకు హర్షవర్ధన్​..

టీకా పంపిణీకి దేశం సన్నద్ధమవుతున్న క్రమంలో తమిళనాడు పర్యటనకు వెళ్లారు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. వ్యాక్సిన్​ సన్నాహాలు, డ్రై రన్​ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. చెన్నైలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించనున్నారు మంత్రి. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు టీకా స్టోరేజీ కేంద్రాల్లో ఒకటైన పెరియమెడులోని జనరల్​ మెడికల్​ స్టోర్​ డిపోట్​(జీఎంఎస్​డీ)కి వెళ్లనున్నారు. ఆ తర్వాత.. చెంగల్పట్టులోని వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి నుంచి హిదుస్తాన్​ బయోటెక్​కు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: 'దేశాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చిన ఘనత మీదే'

Last Updated : Jan 8, 2021, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.