ETV Bharat / bharat

అమ్మాయిల వివాహ వయసు మార్పు వెనుక ఆ ఇద్దరు!

author img

By

Published : Dec 18, 2021, 8:43 AM IST

Harbilas sarda rukhmabai: జాతీయోద్యమంలో స్వాతంత్య్ర సాధనతో పాటు కొన్ని సామాజిక సంస్కరణలూ సమాంతరంగా సాగాయి. తాజాగా.. అమ్మాయిల వివాహ వయసును 21కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేపథ్యం కూడా.. బ్రిటిష్‌ హయాంలోనే ఉంది. బాల్య వివాహ నిరోధక; (లైంగిక చర్యకు)అంగీకార వయసు చట్టాలకు ఆంగ్లేయుల పాలనలోనే అడుగు పడింది. అలాగని ఆంగ్లేయులే ఈ సంస్కరణలు ప్రతిపాదించారంటే పొరపాటు. రుక్మాబాయి అనే సాధారణ మహిళ.. హర్‌బిలాస్‌ సార్దాల (శారదా అని కూడా పలుకుతుంటారు) పోరాటం, చొరవ ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది.

aazadi
ఆజాదీ

Harbilas sarda rukhmabai: 1864లో బొంబాయిలోని ఓ పేద కుటుంబంలో జన్మించింది రుక్మాబాయి. తను పుట్టిన తర్వాత తండ్రి చనిపోయారు. అప్పటికి తల్లి జయంతిబాయికి 14 ఏళ్లే. అదృష్టవశాత్తు.. సకారాం అర్జున్‌ అనే వైద్యుడు ఆమెను మళ్లీ పెళ్లాడారు. 10-11 ఏళ్లకే రుక్మాబాయికి 19 ఏళ్ల దాదాజి భికాజీతో పెళ్లి చేశారు. కాపురానికి వెళ్లే ముందు.. రుక్మాబాయిని చదువుకోవటానికి ప్రోత్సహించారు సవతి తండ్రి సకారాం. 20 ఏళ్లు నిండగానే తన వద్దకు వచ్చేయాలంటూ భర్త భికాజీ ఒత్తిడి చేయటంతో ఆమె నిరాకరించింది.

పెళ్లి సమయానికి తాను చిన్నపిల్లనని, పెళ్లికి తన అంగీకారం లేదంటూ.. రుక్మాబాయి కాపురానికి వెళ్లనంది. దీంతో భర్త కోర్టుకెళ్లారు. కిందిస్థాయి కోర్టు రుక్మాబాయినే సమర్థించింది. కానీ హైకోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. భర్తతో కాపురం చేయాలని లేదంటే రూ.2వేల జరిమానా/ఆరునెలల శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. జరిమానా కడతానుగానీ.. కాపురానికి వెళ్లనని రుక్మాబాయి గట్టిగా నిలబడింది. ఈ కేసు కాస్తా ఆసక్తికరంగా మారి.. బాల్యవివాహాలపై వాదనల దిశగా మళ్లింది. తన సవతి తండ్రితో పాటు అనేకమంది సంస్కరణవాదుల మద్దతు రుక్మాబాయికి లభించింది. దీంతో ఏకంగా బ్రిటిష్‌ రాణి విక్టోరియాకే ఆమె లేఖ సంధించింది. విషయం తెలుసుకున్న విక్టోరియా రాణి.. రుక్మాబాయి పెళ్లిని రద్దు చేస్తూ.. జరిమానా/శిక్ష నుంచి తప్పిస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

బ్రిటిష్‌ ప్రభుత్వం 1891లో ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ (లైంగిక చర్యకు అంగీకార వయసు) చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం లైంగిక చర్య అంగీకార వయసును 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. తర్వాత ఇది అనేక సవరణలతో సాగుతూ వస్తోంది. ఈ విజయానంతరం విరాళాల సాయంతో రుక్మాబాయి ఇంగ్లాండ్‌ వెళ్లి మెడిసిన్‌ చదివి.. సూరత్‌కు వచ్చి డాక్టర్‌గా సేవలందించారు.

ఆర్య సమాజ్‌ ప్రభావంతో..

రుక్మాబాయి పోరాటంతో అమ్మాయిల లైంగిక చర్య అంగీకార వయసు 10 నుంచి 12కు పెరిగినా బాల్య వివాహాలేమీ ఆగలేదు. మహిళా సంఘాలు, సంస్కర్తలు బాల్యవివాహాల నిరోధానికి డిమాండ్‌ చేశారు. గాంధీజీ సైతం బాల్య వివాహాలను వ్యతిరేకించారు. అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయటమంటే.. వారిని చదువులకు దూరం చేయటమేనంటూ ఆయన ప్రకటించారు. అనేక విజ్ఞప్తులు, ఉద్యమాల తర్వాత.. 1929లో హర్‌బిలాస్‌ సార్దా.. చేతుల మీదుగా ఈ చట్టం ఆవిష్కృతమైంది. అజ్‌మేర్‌లో జన్మించిన హర్‌బిలాస్‌... సంఘ సంస్కర్త దయానంద సరస్వతి శిష్యులు, ఆర్యసమాజ్‌ సభ్యుడు. దయానంద సరస్వతి వారసులుగా పేర్కొనే 23 మంది సభ్యుల పరోపకారిణి సభలో హర్‌బిలాస్‌ ఒకరు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమిషనర్‌గా, న్యాయమూర్తిగా పనిచేశారు. 1924లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎంపికైన తర్వాత.. బాల్య వివాహాల నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. వివాహానికి అమ్మాయిల వయసు 14, అబ్బాయిల వయసు 18గా ఆమోదం పొంది.. 1930లో చట్టమై అమల్లోకి వచ్చింది. హర్‌బిలాస్‌ సార్దా (శారదా) పేరిటే ఇది శారదా చట్టంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.