ETV Bharat / bharat

'కరోనా సంబంధిత పోస్టులు అడ్డుకుంటే చర్యలే '

కొవిడ్​ సహాయం కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు.. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సమాచారాన్ని అడ్డుకోవటం లేదా పోస్టు పెట్టిన వారిని వేధించటం నేరంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. సమాచారంతోనే ప్రజల బాధలు తెలుస్తాయని స్పష్టం చేసింది. మనం సంక్షోభంలో ఉన్నామని.. ప్రజల గొంతుక వినాలని సూచించింది.

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : May 3, 2021, 7:32 PM IST

కొవిడ్​-19 కు సంబంధించిన సహాయం కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో అరకొరగా వైద్య సదుపాయాలు ఉన్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆక్సిజన్​ సిలిండర్లు, ఇతర కొవిడ్ ఔషధాలు కావాలని కోరుతూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో తమ వైఫల్యాలు బయటపడతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ పోస్టులను ఫేక్ న్యూస్ అని.. వారిపై చర్యలు తీసుకుంటున్నాయని సుప్రీం దృష్టికి వచ్చింది.

'అది బలవంతమే'

ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించిన సుప్రీం.. సంక్షోభ సమయంలో కొవిడ్ బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేసే సమాచారాన్ని అడ్డుకున్నా, పోస్ట్​ చేసిన వారిపై చర్యలు తీసుకున్నా అది వారిని బలవంతంగా ఇబ్బంది పెట్టినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఇలానే కొనసాగితే.. కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని రాష్ట్రాలను హెచ్చరించింది.

సమాచారంతోనే ప్రజల బాధలు తెలుస్తాయని స్పష్టం చేసింది. మనం సంక్షోభంలో ఉన్నామని.. ప్రజల గొంతుక వినాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ ప్రధాన సెక్రటరీ, పోలీస్​ అధికారులకు సూచించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి : కొవిడ్ నియంత్రణ మా పని కాదు: ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.