మధ్యప్రదేశ్లో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాఘాట్ జిల్లా పరసవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్గావ్ అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. బద్గావ్ సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం సగం కాలిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం మరకలతో ఉన్న రాళ్లు కనిపించటం వల్ల మహిళను అత్యాచారం చేసి తర్వాత రాళ్లతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. మహిళ చేతులపై మెహిందీ ఉన్నందున ఆమెకు కొత్తగా పెళ్లయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ పాదరక్షలు, హెయిర్ క్లిప్స్, సారీ పిన్స్ ఘటనా స్థలానికి కొంత దూరంలో లభ్యమయ్యాయన్నారు.
దుండగులు పథకం ప్రకారమే మహిళను అడవిలోకి తీసుకొచ్చి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : మైనర్పై సామూహిక అత్యాచారం- పట్టాలపై మృతదేహం