ETV Bharat / bharat

జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు- మసీదు కమిటీ పిటిషన్లు కొట్టేసిన హైకోర్ట్ - జ్ఞానవాపి అలహాబాద్​ హైకోర్టు తీర్పు

Gyanvapi Case Court Verdict Today : జ్ఞానవాపి కేసులో అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.

Gyanvapi Mosque Court Verdict Today
Gyanvapi Mosque Court Verdict Today
author img

By PTI

Published : Dec 19, 2023, 11:47 AM IST

Updated : Dec 19, 2023, 12:23 PM IST

Gyanvapi Case Court Verdict Today : జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ కొట్టివేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. 1991లో వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్‌ అనుమతించతగినదే అని జస్టిస్‌ రోహిత్ రంజన్‌ అగర్వాల్ తీర్పు ఇచ్చారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్‌ను ప్రార్థనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని స్పష్టంచేశారు.

  • #WATCH | On Allahabad HC rejecting Anjuman Intezamia Masjid Committee's challenge, advocate Vijay Shankar Rastogi says, “ Today the court has dismissed all five writ petitions filed by the Muslim side, and held that the suit filed in 1991 is not barred by the Section 4 of the… pic.twitter.com/oVqhcHqYm5

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు కాశీ విశ్వనాథ్‌ ఆలయంలో భాగమేనని అక్కడ మసీదు నిర్మించారని కాబట్టి మళ్లీ ఆలయం పునరుద్దరించాలని హిందువులు వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన వారణాసి కోర్టు 2021 ఏప్రిల్‌ 8న జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ-AIMC, ఉత్తర్​ప్రదేశ్‌ సున్నీ సెంటర్ల్ వక్ఫ్ బోర్డ్‌ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ జరిపిన అలాహాబాద్‌ హైకోర్టు ఐదు పిటిషన్లను కొట్టి వేసింది. మసీదు స్థానంలో ఆలయం పునరుద్దరించాలని దాఖలైన పిటిషన్లపై ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.

మొఘల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ గతంలో నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్‌ డేటింగ్‌, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని- ఏఎస్​ఐను ఆదేశించింది. అయితే మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు అలహాబాద్ హైకోర్టులో సవాల్‌ చేశాయి.

Gyanvapi Supreme Court Verdict : జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక్క షరతు!

జ్ఞాన్​వాపి శాస్త్రీయ సర్వే- డబుల్​ లాకర్​లో 300కుపైగా ఆధారాలు, పురాతన మత చిహ్నాలు సైతం!

Last Updated : Dec 19, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.