ETV Bharat / bharat

అతివేగంతో కారు బీభత్సం.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం - ఫోన్​ ఇవ్వలేదని తమ్ముడిని చంపిన అన్న

బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గుజరాత్​లో జరిగిన మరో ఘటనలో ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు మొబైల్ ఫోన్‌ ఇవ్వలేదని తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు ఓ అన్న.

accident
accident
author img

By

Published : May 26, 2022, 7:01 PM IST

Madhyapradesh Road Accident: మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి కారు డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.

పోలీసులు సమాచారం ప్రకారం.. జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాగావ్​ ఖురాయ్​ గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి ఓ కుటుంబం హాజరైంది. కార్యక్రమం పూర్తయ్యాక బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా నడుపుతూ రోడ్డుపై వేచి ఉన్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడు ఓ డ్రైవర్​. ఆ తర్వాత కారు వదిలి పరారయ్యాడు. గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులను పప్పు జఠవ్ (50), అతడి భార్య రాజా బేటీ (35), వారి కుమార్తెలు రేష్మ (10), పూనమ్​గా (5) గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఫోన్​ కోసం తమ్ముడ్ని చంపిన అన్న.. గుజరాత్​ అహ్మదాబాద్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు మొబైల్‌ ఫోన్‌ ఇవ్వలేదని సొంత తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు ఓ అన్న. ఆ తర్వాత బాధితుడి మృతదేహాన్ని బావిలో పడేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్​లోని బన్స్వారా జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం గుజరాత్​ అహ్మదాబాద్​ జిల్లాలోని గోబ్లెజ్​ గ్రామానికి వచ్చింది. అయితే ఆ కుటుంబంలోని ఇద్దరు సోదరులు వంతులవారీగా మొబైల్​లో ఆన్​లైన్​ గేమ్​ ఆడుకుంటున్నారు. నిందితుడు వంతు వచ్చినప్పుడు ఫోన్​ ఇవ్వడానికి నిరాకరించాడు బాధితుడు. దీంతో సోదరుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో తన తమ్ముడి తలపై బండరాయితో కొట్టాడు అన్న. వెంటనే బాధితుడు చనిపోయాడు. ఆ తర్వాత ఎవ్వరూ లేని తమ్ముడి మృతదేహాన్ని బావిలో పడేశాడు. కాసేపయ్యాక ఎవ్వరికీ చెప్పకుండా నిందితుడు తన స్వగ్రామానికి బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు తమ కుమారులిద్దరూ ఇంట్లో కనిపించకపోవడం వల్ల తల్లిదండ్రులు గ్రామస్థులను ఆరాతీశారు. వారి ఊరికి వెళ్లి పెద్ద కొడుకు ఆచూకీ తెలుసుకున్నారు. తమ్ముడి గురించి అడగగా నిందితుడు జరిగినదంతా చెప్పాడు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బావిలో నుంచి బాధితుడి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి: అత్యాచార బాధితురాలికి కన్యత్వ పరీక్ష.. పబ్లిక్ టాయిలెట్​లో నవజాత శిశువు!

500కుపైగా కేసులు.. రూ.84 లక్షల రివార్డ్​.. మావోయిస్టు అగ్రనేత అనుమానాస్పద మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.