ETV Bharat / bharat

Gurpatwant Singh Pannun Property : కెనడా హిందువులకు గుర్​పత్వంత్​ వార్నింగ్​.. ఆస్తులు జప్తు చేసి కేంద్రం షాక్​.. - గుర్​పత్వంత్​ సింగ్ పన్నూపై కేసులు

Gurpatwant Singh Pannun Property : కెనడా నుంచి హిందూ కెనెడియన్లు వెళ్లిపోవాలని వార్నింగ్​ ఇచ్చిన ఉగ్రవాది గుర్​పత్వంత్​ సింగ్​కు కేంద్రం షాకిచ్చింది. అతడికి సంబంధిచిన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్​ఐఏ జప్తు చేసింది.

Gurpatwant Singh Pannun Property
Gurpatwant Singh Pannun Property
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 6:59 PM IST

Updated : Sep 23, 2023, 7:41 PM IST

Gurpatwant Singh Pannun Property : హిందూ కెనెడియన్లు కెనడా నుంచి వెళ్లిపోవాలని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ చీఫ్‌, ఉగ్రవాది గుర్​పత్వంత్ సింగ్‌ పన్నూపై కేంద్రం చర్యలు తీసుకుంది. చండీగఢ్‌లోని పన్నూ ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ సీజ్‌ చేసింది. అమృత్‌సర్‌లోని పన్నూ పూర్వీకులకు చెందిన పొలాన్ని, చండీగఢ్​లోని సెక్టార్​ 15లో ఉన్న మరో ఇంటిని జప్తు చేసింది. 2020లోనే వీటిని ఎన్​ఐఏ అటాచ్‌ చేయగా.. ఇప్పుడు శాశ్వతంగా జప్తు చేసినట్లు తెలిపింది. పంజాబ్​తో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గురుపత్వంత్​పై 2019లో ఎన్​ఐఏ మొదటి కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి అతడిపై ఎన్​ఐఏ ఓ కన్నేసి ఉంచింది.

Gurpatwant Singh Pannun Property
ఆస్తుల జప్తు నోటీసు ఏర్పాటు చేస్తున్న అధికారులు

2020 జులైలో గుర్‌పత్‌వంత్‌ సింగ్‌ పన్నూను ఉగ్రవాదిగా భారత్‌ ప్రకటించింది. అతడిపై 3 దేశద్రోహ కేసులతోపాటు 22 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 3న పన్నూపై ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు నాన్​ బెయిలబుల్​ అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. అనతంరం అదే ఏడాది నవంబర్ 29న అతడిని 'ప్రొక్లేయిమ్డ్​ నేరస్థుడు'గా ప్రకటించింది. పన్నూ స్థాపించిన సిఖ్స్​ ఫర్​ జస్టిస్​ సంస్థ.. ఇంటర్నెట్​ ద్వారా యువతను మోసం చేసి.. ఉగ్రవాద ఘటనలు, నేరాలకు పాల్పడేలా ప్రేరేపిస్తోందని ఎన్​ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.

Gurpatwant Singh Pannun Video : పన్నూపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని భారత్‌ పలుమార్లు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక ఖలిస్తాన్‌కు మద్దతు కోసం కెనడా, ఆస్ట్రేలియాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పన్నూ హస్తం ఉంది. నిజ్జర్‌ హత్యకు కెనడాలోని ఇండియన్‌ హైకమిషనర్‌దే బాధ్యతన్న రిఫరెండం కోసం పన్నూ ఇప్పటికే కెనెడియన్‌ సిక్కులకు పిలుపునిచ్చాడు. సీనియర్​ భారత దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. అటు.. హిందూ కెనెడియన్లు దేశం నుంచి వెళ్లిపోవాలన్న వీడియోపై కెనడా ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలో పౌరులంతా సమానమే అని స్పష్టం చేసింది. మరోవైపు కెనడాలో హతమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్​దీప్​ సింగ్ నిజ్జర్​ పంజాబ్​ ఆస్తులపైనా ఎన్​ఐఏ జప్తు నోటీసులు అతికించింది.

'రిపబ్లిక్ డే రోజున ఇళ్లలోనే ఉండండి.. లేదంటే అంతే'.. ఉగ్రవాది హెచ్చరిక

Canada Khalistani Killed : కెనడాలో మరో ఖలిస్థానీ హత్య.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్

Last Updated : Sep 23, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.