Gunfire While Watching KGF Chapter-2: కర్ణాటక హవేరి జిల్లా శిగ్గావిలో కాల్పులు కలకలం రేపాయి. వసంతకుమార్ అనే యువకుడిని తుపాకీతో కాల్చాడు ఓ వ్యక్తి. కేజీఎఫ్ చాప్టర్-2 సినిమా చూస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడు కేజీఎఫ్ సినిమా చూస్తుండగా.. నిందితుడికి కాలు తగిలింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తుపాకీతో వసంతకుమార్ను కాల్చాడు. తీవ్రగాయాలు కావడం వల్ల చికిత్స నిమిత్తం అతడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: మామూలోడు కాదు.. ఐపీఎల్ మ్యాచ్లను సొంత యాప్లో పెట్టేశాడు!