ETV Bharat / bharat

విచిత్రంగా జడేజా 'ఫ్యామిలీ పాలిటిక్స్'.. భాజపా అభ్యర్థిగా భార్య.. కాంగ్రెస్​ ప్రచారకర్తగా చెల్లి - రివాబా జడేజా పాలిటిక్స్

తన భార్యను గెలిపించాలంటూ ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా జామ్​నగర్​లో రోడ్​షో నిర్వహించారు. అందుకు కాసేపటి ముందే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, కాంగ్రెస్​ కోసం ఓట్లు అభ్యర్థించారు ఆయన సోదరి నయ్​నబా జడేజా. ఈ ఆసక్తికర సంఘటనకు గుజరాత్​ ఎన్నికలు వేదికయ్యాయి.

ravindra jadeja wife bjp
ravindra jadeja wife bjp
author img

By

Published : Nov 27, 2022, 7:21 PM IST

గుజరాత్​లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే జామ్​నగర్​ నార్త్​ స్థానం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపా తరఫున ప్రముఖ క్రికెటర్​ రవీంద్ర జడేజా భార్య పోటీచేస్తుండగా.. ఆమెకు ప్రత్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు ఆయన సోదరి నయ్​నబా జడేజా. ధరల పెరుగుదల.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఓట్లను అడుగుతున్నారు.

ravindra jadeja wife bjp
ప్రచారం చేస్తున్న జడేజా సోదరి

జామ్​నగర్​ నార్త్​ నుంచి భాజపా తరఫున రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి బిపేంద్రసింగ్​ జడేజా పోటీచేస్తున్నారు. తొలుత కాంగ్రెస్​ నుంచి టికెట్ ఆశించిన నయ్​నబాకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతుగా నియోజకవర్గమంతా స్టార్​ క్యాంపైనర్​గా మారి ప్రచారం చేస్తున్నారు. భాజపా సైతం సిట్టింగ్​ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్​ జడేజాను పక్కకుపెట్టి రివాబాకు టికెట్​ కేటాయించింది.

ravindra jadeja wife bjp
రివాబా జడేజా

తనకు ఓ సిద్ధాంతం ఉందని.. దానిని అభిమానించే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు నయ్​నబా జడేజా. ధరల పెరుగుదల, ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించిన ఆమె.. భాజపా హామీలు మాత్రమే ఇస్తోందని.. వాటిని నేరవేర్చదని ఆరోపించారు. అంతకుముందు గెలిచిన భాజపా అభ్యర్థి.. కాంగ్రెస్ వ్యక్తేనని, ఈ సారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

ravindra jadeja wife bjp
ప్రచారం చేస్తున్న జడేజా సోదరి

జామ్​నగర్​ నార్త్​ పూర్తిగా పట్టణ ప్రాంతం కావడం వల్ల సహజంగానే భాజపాకు అనుకూలమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా సరే ఈ సారి విజయం తమదేనని అంటున్నారు కాంగ్రెస్​ మద్దతుదారులు. భాజపా వైఫల్యాలు, సిట్టింగ్​ అభ్యర్ధి మార్పు తమకు లాభిస్తాయని చెబుతున్నారు. 2012 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్​ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం భాజపాలో చేరి.. 2017లోనూ గెలుపొందారు.

ravindra jadeja wife bjp
భార్య తరఫున ప్రచారం చేస్తున్న రవీంద్ర జడేజా

2019లో భాజపాలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన రివాబా.. గత కొన్నేళ్లుగా భాజపా తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజ్​పుత్​ వర్గానికి చెందిన ఆమె కమలదళంలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్​గా నియమితులయ్యారు. గుజరాత్​లో డిసెంబరు 1, 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెలువడనున్నాయి.

ఇవీ చదవండి: విభిన్నంగా సాగుతున్న గుజరాత్​ ప్రచారం.. 'ఆప్'​ను ప్రత్యర్థిగా లెక్కచేయని భాజపా, కాంగ్రెస్​!

ట్విట్టర్​ పోల్​లో జడేజా భార్యకు ఊహించని షాక్​.. ఆ పోస్ట్​ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.