ETV Bharat / bharat

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం! - రాజ్​కోట్ న్యూస్

గుజరాత్​ రాజ్​కోట్​లో 70 కార్డియోమెగాలి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలోనే ఈ వ్యాధి తీవ్రత ఉన్నట్లు పేర్కొన్నారు.

cardiomegaly, heart problem
కార్డియోమెగాలి, గుండె సమస్యలు
author img

By

Published : Jul 24, 2021, 4:53 PM IST

కరోనా వైరస్​ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మ్యూకోర్మైకొసిస్​, బ్లాక్​ ఫంగస్, మల్టీ సిస్టమ్ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్(ఎమ్​ఐఎస్) కేసులు వెలుగుచూశాయి. అయితే.. గుజరాత్ రాజ్​కోట్​​లో కొత్తగా 70కిపైగా కార్డియోమెగాలి(గుండె పరిమాణం పెరగడం) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేశారు.

కార్డియోమెగాలి బాధితుల్లో.. 15 నుంచి 25 శాతం మంది కొరొనరీ హర్ట్​ డిసీజ్​ వల్లే మరణించారని అధికారులు తెలిపారు.

"కరోనా ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపదు. కొవిడ్​ రోగుల్లో.. రక్తం గడ్డకట్టడం మొదలైన సమస్యలూ తలెత్తాయి. చాలా మంది కరోనా రోగులు కార్డియోమెగాలితో బాధపడుతున్నారు."

--డాక్టర్. సందీప్ హర్సోరా, ఐసీయూ స్పెషలిస్ట్.

పెరిగిన గుండెపోటు మరణాలు..

కొవిడ్​ నుంచి కోలుకున్న 30-45 ఏళ్ల మధ్య వయసువారిలో గుండెపోటు మరణాలు కూడా పెరిగాయి. అయితే.. వీరిలో గుండెపోటు లక్షణాలతో బాధపడ్డవారు తక్కువేనని అధికారులు తెలిపారు.

రక్తకణాలపై కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. కొరొనరీ హర్ట్​ అటాక్​ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇదీ చదవండి:కరోనాతో చావుబతుకుల్లో భర్త- వీర్యం కోసం భార్య పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.