పెళ్లికి రెండురోజులు ఉందనగా ఓ నర్సు కరోనాతో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో జరిగింది.
![nurse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/valsad_nurse_1_2204newsroom_1619104665_82.jpg)
![nurse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/valsad_nurse_2_2204newsroom_1619104665_339.jpg)
కప్రదా తాలుగా మోటపొంధా గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ కూతురి పేరు మనీషా బెన్. దగ్గరలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు పెళ్లి కుదరగా.. కొద్దిరోజుల నుంచి ఇంటివద్దే ఉంటోంది. ఏప్రిల్ 23నే వివాహం. పెళ్లి కార్డులు కూడా పంచారు. అయితే ఇంతలో కరోనా సోకి సిల్వాసా ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అత్యవసరంగా ఓ ఇంజెక్షన్ అవసరమైంది. తీసుకొచ్చేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు సూరత్ వెళ్లగా.. ఇంజక్షన్ తెచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది.
ఇదీ చదవండి: దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా