స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వెనకబడిన క్రమంలో ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ చావ్డా, రాష్ట్ర సీఎల్పీ నేత పరేశ్ ధనాని తమ పదవులకు రాజీనామా చేశారు.
" మా అంచనాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుంది. "
- అమిత్ చావ్డా, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు.