ETV Bharat / bharat

'గుజరాత్​లో కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం.. హిమాచల్​లో ఈసారి అలా జరిగింది!' - pm modi at bjp headquarters

Gujarat Election Result 2022 : గుజరాత్ ప్రజలు భాజపావైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీ కార్యకర్తల కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. స్వల్ప తేడాతో హిమాచల్​ ప్రదేశ్​లో ఓటమిపాలయ్యామని మోదీ తెలిపారు. గుజరాత్​ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు.

Gujarat Election Result 2022
భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ
author img

By

Published : Dec 8, 2022, 7:43 PM IST

Gujarat Election Result 2022 : గుజరాత్​ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​సింగ్ పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రధాని మోదీ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా సత్తా చాటిందని పేర్కొన్నారు. బిహార్‌లో గెలుపు మున్ముందు భాజపా సాధించే విజయాలకు సంకేతమని వ్యాఖ్యానించారు.

'ఎన్నికల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు. హిమాచల్‌లో ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. హిమాచల్‌లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేది. ప్రభుత్వం మారిన ప్రతీసారి 5, 6, 7 శాతాల తేడాతో గెలుపు ఓటములు ఉండేవి. భాజపాను గెలిపించేందుకు ఆ రాష్ట్ర ప్రజలు కృషిచేశారు. హిమాచల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.'

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.