భారత వైమానిక దళానికి చెందిన ఎఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్.. గుజరాత్ ఖేడా జిల్లా వీణా గ్రామం పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో అందులో ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా, సౌత్ వెస్ట్ వైమానిక దళ ఛీప్ ఎయిర్ మార్షల్ ఎస్కే ఘోటియా ఉన్నారు. సాంకేతిక సమస్య కారణాలతోనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కేవడియాలో మూడు రోజుల పాటు జిరగిన సైనిక అధికారుల ఉన్నత స్థాయి సదస్సు ముగిసిన తరువాత ఆహ్మదాబాద్కు తిరుగు ప్రయాణంలో ఇలా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.