గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల వైరస్ బారిన పడిన రూపానీ.. కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ నెల 15న ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరలో వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూ.ఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. అనంతరం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారం వ్యవధిలోనే ఆయన కోలుకోవడం విశేషం.
ఇదీ చూడండి: గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్