ETV Bharat / bharat

ఆక్సిజన్​ సిలిండర్లపై  భాజపా నేత ఫొటోలు - political leader photos on Oxygen cylinders

ఒకవైపు దేశమంతా కరోనాతో పోరాడుతుంటే.. ఇదే అదనుగా ఆక్సిజన్​ సిలిండర్లపై తన పోస్టర్లు అతికించి ప్రచారం చేసుకుంటున్నారు గుజరాత్​కు చెందిన ఓ భాజపా నేత. తాను ప్రారంభించిన ఓ కొవిడ్​ కేర్​ సెంటర్​కు ఆక్సిజన్​ సిలిండర్లు పంపిణీ చేశారు. వీటిపై ఆయన పోస్టర్లు ఉండటం వివాదాస్పదమైంది.

Oxygen cylinders
ఆక్సిజన్​ సిలిండర్​
author img

By

Published : Apr 21, 2021, 1:30 PM IST

కరోనా వేళ ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. ఇదే అదనుగా ఆక్సిజన్​ సిలిండర్లపై తన పోస్టర్లు అతికించి ప్రచారం చేసుకుంటున్నారు గుజరాత్​ అమ్రేలీ జిల్లాకు చెందిన భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే హీరా సోలంకి. ప్రజలకు సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఛతదియా రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలను 25 పడకలతో కొవిడ్ కేర్​ సెంటర్​గా మార్చారు. దీనిని సోలంకి ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం భోజన వసతి కల్పించారు.

Oxygen cylinders
పోస్టర్లు ఉన్న ఆక్సిజన్​ సిలిండర్లు

ఈ కొవిడ్ కేర్​ సెంటర్ కోసమే 150 పైగా ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చారు సోలంకి. ఇంతా చేసిన సోలంకి.. ప్రజలను ఆకర్షించడానికి ఆక్సిజన్​ సిలిండర్లపై తన ఫొటో, పేరు ఉన్న పోస్టర్లను అతికించారనే అపవాదు మూటకట్టున్నారు.

Oxygen cylinders
కొవిడ్​ కేర్​ సెంటర్​లో పోస్టర్లు ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు

ఈ విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆయన.. తన మద్దతుదారులు ఇలాంటి పొరపాటు చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సిలిండర్ల దుర్వినియోగాన్ని నివారించవచ్చన్నారు. తన మద్దతుదారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'నోట్లరద్దులాగే.. వాక్సినేషన్​లోనూ కేంద్రం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.