కొవిడ్ టీకా(Vaccine)లకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
- కొవిడ్(Covid) టీకాల లభ్యత, విలువ, వాటికి సంబంధించిన జాగ్రత్తలపై ఫ్రంట్‌లైన్ వర్కర్లు, టీకాలు ఇచ్చేసిబ్బంది గర్భిణులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి.
- కరోనా బారిన పడిన గర్భిణుల్లో 90శాతం మంది ఆస్పత్రులో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. అలాగే కొద్దిమందిలో ఆరోగ్యం క్షిణించే ప్రమాదం ఉంది. దానివల్ల గర్భస్థ పిండంపై ప్రభావం పడొచ్చు. అందువల్ల గర్భిణులు టీకా తీసుకోవాలి.
- వ్యాధి లక్షణాలు కనిపించిన గర్భిణులకు తీవ్ర ఇన్ఫెక్షన్, మరణం ముప్పుఎక్కువ. వ్యాధి తీవ్రమైతే వారు ఆస్పత్రిలో చేరాలి. కొవిడ్ వ్యాధి బారిన పడిన గర్భిణులకు జన్మించే శిశువుల్లో 95శాతం జనన సమయంలో ఆరోగ్యంగానే ఉన్నారు.
- గర్భిణుల్లో 35ఏళ్లు పైబడినవారు, ఊబకాయం ఉన్నావారు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు, కాళ్లు చేతుల్లో రక్తం గడ్డకట్టిన అనుభవాలు ఉన్నవారికి కొవిడ్‌తో సమస్యలు రావొచ్చు.
- కొవిడ్ టీకాలు గర్భిణులకు సురక్షితమే. ఇన్ఫెక్షన్ నుంచి అవి వారిని రక్షిస్తాయి. ఇతర ఔషధాల తరహాలో వీటివల్ల కొద్దిపాటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయని గానీ.. పిండంపై ప్రభావం ఉంటుందని గానీ ఇప్పటివరకూ ఆధారాలు లేవు.
ఇదీ చూడండి: భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాకు భద్రత పెంపు