ETV Bharat / bharat

ఎందుకు కొవిడ్-19 అని పిలుస్తారు? - కొవిడ్​-19

మహమ్మారి అతలాకుతలం చేసిన ఈ ఏడాదిలో నెటిజన్లు గూగుల్​లో ఎక్కువగా దేని గురించి శోధించారో తెలుసా..? ఏఏ అంశాలపై ఆసక్తి చూపారు..? ఇలాంటి వివరాలతో గూగుల్​ ఓ వీడియోను రూపొందించింది. ప్రతి ఒక్కరినీ పరీక్షించిన ఈ సంవత్సరంలో 'వై(ఎందుకు)' అనే పదాన్నే ఎక్కువగా వెతికారట. ఇంకా ఐపీఎల్​, వంటల్లో పన్నీర్​ తయారీ ఎలా వంటి వాటిపై ఆసక్తి కనబరిచారు.

author img

By

Published : Dec 27, 2020, 6:21 AM IST

2020లో కరోనావైరస్, కొవిడ్‌-19, టీకా, చైనా, మాస్క్.. ఎక్కువగా ఈ తరహా పదాలే వినిపించాయి. ఈ మహ్మమారి ప్రపంచాన్ని అంతగా అతలాకుతలం చేసింది. గూగుల్‌లో నెటిజన్లు కూడా దీని గురించే ఎక్కువగా శోధించారు. వీటితో పాటు ప్రజలు ఈ ఏడాదిలో ఇంకా ఏఏ అంశాలపై ఆసక్తి చూపారు? వేటికి సమాధానాలు తెలుసుకోవాలనుకున్నారు? వంటి వివరాలతో గూగుల్ ఒక వీడియోను రూపొందించింది.

ఎందుకు గురించే మొత్తం..

'ఎందుకు' అని తెలుసుకోవడం మానవ సహజ లక్షణం. ప్రతి ఒక్కరిని పరీక్షించిన ఈ సంవత్సరంలో 'వై(ఎందుకు)' అనే పదాన్ని ఎక్కువగా శోధించారు’ అని వివరిస్తూ గూగుల్ వీడియో ప్రారంభమవుతోంది. ఎక్కువగా కొవిడ్‌కు సంబంధించిన వెతుకులాటలే ఉన్నాయని తెలిపింది. కాగా, వై అనే పదంతో పాటు వై ఈస్​ ఇట్ కాల్డ్ కొవిడ్-19?(ఎందుకు దీన్ని కొవిడ్-19 అని పిలుస్తారు?) అనే ప్రశ్న గురించి నెటిజన్లు విపరీతంగా ఆరాతీశారు. దాంతో పాటు వై బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్స్‌?, వై ఈజ్ ఆస్ట్రేలియా బర్నింగ్? వంటి ప్రపంచంపై ప్రభావం చూపిన ఘటనల గురించి తెలుసుకున్నారు.

పనీర్​ తయారీ ఎలా..?

అలాగే భారత్‌లో మాత్రం ఐపీఎల్‌ హవా కొనసాగించింది. కరోనా వైరస్‌ కోసం చేసిన శోధనల కంటే ఈ పొట్టి క్రికెట్‌ గురించే ప్రజలు ఆసక్తి చూపారు. గూగుల్‌ శోధనలపై కూడా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ పడింది. ఈ సమయంలో కొత్త కొత్త వంటల తయారీ గురించి శోధించిన క్రమంలో ‘పనీర్ తయారీ’ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

మరోవైపు, 'ఎలా సహాయం చేయాలి' అనే విషయంపై కూడా నెటిజన్లు దృష్టి సారించారు. ఇక మాస్క్‌ ఎమోజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. దానికోసం చేసిన శోధనలు రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉన్నాయని తెలిపింది. 2020కి సంబంధించి ప్రజలు ఆసక్తి చూపిన అంశాలతో రూపొందించిన ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన దగ్గరి నుంచి 10 కోట్ల వీక్షణలు అందుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.