మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం అమానుష ఘటన చోటుచేసుకుంది. చికిత్స చేయాల్సిన ఓ మహిళను ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు 300 మీటర్లు దూరం లాక్కెళ్లి గేటు బయట పడేశాడు. మధ్యలో బురదలోనూ అలాగే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఆసుపత్రి అధికారులు స్పందించి.. ఆ గార్డును తొలగించారు.
అయితే ఆమె పట్ల ఎందుకలా అమానుషంగా ప్రవర్తించారో చెప్పేందుకు నిరాకరించారు అక్కడి సిబ్బంది. బాధిత మహిళకు మతిస్థిమితం లేకపోగా.. ఎవరో ఆమెను తీసుకొచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారని సమాచారం. ఆసుపత్రి సిబ్బంది సూచనలతో గార్డు ఇలా చేసినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అమ్మభాషతోనే స్వావలంబన: వెంకయ్య