ETV Bharat / bharat

Varun Singh Condition: విషమంగానే కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఆరోగ్యం - వరుణ్​ సింగ్​ ఆరోగ్య పరిస్థితి

Varun Singh Condition: కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు.. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

captain varun singh health
వరుణ్​ సింగ్​
author img

By

Published : Dec 11, 2021, 5:22 AM IST

Updated : Dec 11, 2021, 6:40 AM IST

captain varun singh health: బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గాయపడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు మొదట వెల్లింగ్​టన్​ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.

శౌర్య చక్ర..

Pilot Varun Singh News: శౌర్య చక్ర..వరుణ్​ సింగ్​ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్​ డిఫెన్స్​)లో విధులు నిర్వహించారు. వరుణ్​ సోదరుడు తనూజ్​.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్​ కమాండర్​.వరుణ్​ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్​లో.. ఆయన నడుపుతున్న తేజస్​ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్​.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.

లేఖ వైరల్​..

'మీరు యావరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏంటో గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి'.. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన స్ఫూర్తిదాయక పదాలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెప్తూ.. తాను చదివిన హరియాణాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌కు సెప్టెంబర్‌లో వరుణ్ లేఖ రాశారు. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Helicopter Crash: డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్​ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది. ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ జనరల్ బిపిన్ రావత్​ ప్రయాణిస్తున్న చాపర్​లో ఒకరు.

ఇదీ చదవండి: చాపర్ క్రాష్​లో గాయపడ్డ వరుణ్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ బెంగళూరుకు తరలింపు

Last Updated : Dec 11, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.