భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు 'వీర్ చక్ర' పురస్కారాన్ని (abhinandan varthaman award) ప్రదానం చేసింది కేంద్రం. దిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అభినందన్ అందుకున్నారు. యుద్ధ సమయాల్లో చూపిన అద్భుత పోరాటపటిమకు గాను సైనికులను అందించే మూడో అత్యున్నత పురస్కారం వీర్ చక్ర(abhinandan varthaman awarded vir chakra).
భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్.. బాలాకోట్ వైమానిక దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. 2019 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ హోదాలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేశారు. శత్రు దేశానికి పట్టుబడిన సమయంలోనూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
మరికొందరికీ..
- వివిధ ఆపరేషన్లలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, 200 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్కు శౌర్య చక్ర (మరణానంతరం) ప్రదానం చేశారు. ఆయన భార్య లెఫ్టినెంట్ నితికా కౌల్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
- జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులను అంతమొందించిన 'కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్'కు చెందిన సాపర్ ప్రకాష్ జాదవ్ రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు 'కీర్తి చక్ర'కు (మరణానంతరం) ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన సతీమణి, తల్లి ఈ అవార్డును అందుకున్నారు.
- జమ్మూలో జరిగిన ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని(A++ కేటగిరీకి చెందిన) హతమార్చి, ఆ పోరులో అమరుడైన నాయబ్ సుబేదార్ సోంబిర్ తల్లి, భార్య కలిసి 'శౌర్య చక్ర' అందుకున్నారు.
ఇవీ చదవండి: