పంజాబ్ పఠాన్‌కోట్‌లోని(Pathankot News) ధీరాపుల్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ ఎదుట గ్రనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఆర్మీ ఆఫీస్ వద్ద ఉన్న త్రివేణి గేట్(Pathankot News) పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.
గుర్తుతెలియని దుండగులు.. ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్‌ను(Pathankot news army) విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అదే సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు.
సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. పఠాన్‌కోట్‌లోని(Pathankot news army) అన్ని పోలీస్ చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు