జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలో పోలీసులు తృటిలో గ్రనేడ్ దాడి నుంచి తప్పించుకున్నారు. సాంబా- ఉదంపూర్ రోడ్డుపై నిర్బంధ తనిఖీలు నిర్విహిస్తుండగా.. ముష్కరులు గ్రనేడ్ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు దాడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ తనిఖీలు నిర్వహిస్తున్న ప్రదేశానికి దూరంగా పడి పేలినట్లు వివరించారు. తప్పించుకున్న ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.