ETV Bharat / bharat

కొత్తగా గ్రీన్ ఫంగస్.. లక్షణాలు ఇలా...

కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్​, వైట్​, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్​ ఇందోర్​లో ఓ వ్యక్తికి గ్రీన్​ ఫంగస్​ సోకింది. అయితే.. ఈ వైరస్​ ప్రభావం రోగులపై ఎంతగా ఉందనేది తెలియాల్సి ఉంది.

author img

By

Published : Jun 16, 2021, 10:59 AM IST

green fungus,MP
గ్రీన్ ఫంగస్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ ఇందోర్​లో కొత్తగా గ్రీన్ ఫంగస్​ కేసు వెలుగుచూసింది. అయితే.. ఇది ఇతర ఫంగస్​లకంటే ప్రమాదకారా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ముంబయికి తరలింపు..

ఇటీవలే కొవిడ్​ నుంచి కోలుకున్న 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్​ సోకినట్లు నిర్ధరించారు శ్రీ అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు. రోగిని ముంబయి ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.

తొలుత బ్లాక్​ ఫంగస్​ సోకిందని పరీక్షలు నిర్వహించగా రోగికి గ్రీన్​ ఫంగస్​ సోకినట్లు తేలిందని డాక్టర్. రవి దోసి తెలిపారు. అయితే.. ఈ ఫంగస్​పై మరింత అధ్యయనం చేయడం అవసరమని ఆయన అన్నారు. కొవిడ్​ నుంచి కోలుకున్నప్పటికీ.. రోగిలో అధిక జ్వరం, ముక్కులోంచి రక్తం వంటి లక్షణాలు కనిపించాయని దోసి వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.